Shopping cart

Subtotal $0.00

View cartCheckout

At Peoplespost News, we aim to give our readers clear and useful information. We focus on honest reporting and keeping you updated about important events around the world.

TnewsTnews
  • Home
  • desk
  • ABN vs BRS : చింతించిన ABN – మరి బీఆర్ఎస్.?

ABN vs BRS : చింతించిన ABN – మరి బీఆర్ఎస్.?

ఏబీఎన్ యాంకర్ వెంకటకృష్ణ చేసిన వ్యాఖ్యలపై ఆ చానల్ బాధ్యత తీసుకుంది. గెట్ ఔట్ ఆఫ్ మై డిబేట్ అన్న మాటలపై చిందిస్తున్నామని వెనక్కి తీసుకుంటున్నామని ప్రకటించింది. అయితే డిబేట్ లో జర్నలిస్టుల్ని బూతులు తిట్టిన రవీందర్ రావు కూడా ఇలాగే చేయగలరా అని ప్రశ్నించింది. ఆయన చేస్తారో లేదో కానీ ఏబీఎన్ మాత్రం తన తప్పు దిద్దుకునే ప్రయత్నం చేసింది.

అలాగే గతంలో వెంకటకృష్ణ డిబేట్ లో బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డిపై అమరావతి ఉద్యమకారుడిగా ఉన్న కొలికపూడి శ్రీనివాస్ చెప్పు విసిరారు. అప్పట్లోనే ఈ అంశంపై ఆయనపై విమర్శలు వచ్చాయి. మోడరేటర్ గా ఉండి.. అలాంటి పరిస్థితి నివారించలేకపోయారని అనుకున్నారు. అప్పట్లో అమరావతి ఉద్యమం పీక్ లో ఉండటం.. విష్ణువర్దన్ రెడ్డి రైతులపై అనుచిత వ్యాఖ్యలు చేశారని భావించడంతో పెద్దగా ఎవరూ స్పందించలేదు. కానీ ఎలాంటి వ్యాఖ్యలు చేసినా స్పందన మాత్రం టీవీ డిబేట్ లో అలా ఉండకూడదు.. ఆ పరిస్థితిని నివారించాల్సింది వెంకటకృష్ణే కదా..

ఇప్పుడు నేరుగాఆయనే వివాదంలోకి వెళ్లారు. ఎదుటి వ్యక్తి ఘోరంగా మాట్లాడుతున్నప్పుడు.. ఆయనను గౌరవంగా పిలిచారు కాబట్టి రో అంతే గౌరవంగా డిబేట్ నుంచి తప్పించడానికి అవకాశం ఉంది. కానీ అలా కాకుండా ఫ్రస్ట్రేషన్‌కు గురయ్యారు. అందుకే ఇప్పుడు చానల్ చింతిస్తున్నామన్న ప్రకటన చేసింది. కానీ బీఆర్ఎస్ తరపున మాట్లాడిన తక్కెళ్లపల్లి రవీందర్ రావు తమ నిర్ణయాల పట్ల చింతించే అవకాశం ఉన్నా అలా చేయలేదు. మీడియాకు ఉన్న విలువలను వారు కాపాడుకున్నారు..మరి బీఆర్ఎస్ కూడా అలా చేసి ఉంటే బావుండేది.

Comments are closed

Related Posts