Shopping cart

Subtotal $0.00

View cartCheckout

At Peoplespost News, we aim to give our readers clear and useful information. We focus on honest reporting and keeping you updated about important events around the world.

TnewsTnews
  • Home
  • National
  • Accident : ఉత్తరాఖండ్ లో ఘోర ప్రమాదం.. ఏడుగురు మృతి, పలువురికి గాయాలు

Accident : ఉత్తరాఖండ్ లో ఘోర ప్రమాదం.. ఏడుగురు మృతి, పలువురికి గాయాలు

ఉత్తరాఖండ్ రాష్ట్రం అల్మోరా జిల్లాలో మంగళవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ప్రయాణికులతో వెళ్తున్న ఒక బస్సు అదుపు తప్పి లోతైన లోయలోకి పడిపోయింది. ఈ దుర్ఘటనలో ఏడుగురు అక్కడికక్కడే మృతి చెందగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ప్రాథమిక సమాచారం ప్రకారం, బస్సు ద్వారాహట్ నుంచి రామ్‌నగర్ వైపు ప్రయాణిస్తుండగా, భికియాసైన్ సమీపంలోని వంకర మలుపు వద్ద ప్రమాదం జరిగింది. దాదాపు 200 మీటర్ల లోతైన లోయలోకి బస్సు జారిపోవడంతో ఘటన తీవ్రత పెరిగింది.

సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, SDRF, స్థానిక సహాయక బృందాలు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. గాయపడిన వారిని సమీప ఆసుపత్రులకు తరలించగా, కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదంపై ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలియజేస్తూ, గాయపడినవారికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు.

పర్వత ప్రాంతాల్లోని రహదారులు ఇరుకుగా ఉండటం, మలుపులు అధికంగా ఉండటంతో పాటు వాతావరణ పరిస్థితులు ప్రమాదాలకు కారణమవుతున్నాయని అధికారులు పేర్కొన్నారు.

Comments are closed

Related Posts