Shopping cart

Subtotal $0.00

View cartCheckout

At Peoplespost News, we aim to give our readers clear and useful information. We focus on honest reporting and keeping you updated about important events around the world.

TnewsTnews
  • Home
  • Movie
  • మామయ్య అంటే బన్నీకి ఎంత ప్రేమో..! MSVG Review

మామయ్య అంటే బన్నీకి ఎంత ప్రేమో..! MSVG Review

మెగాస్టార్ చిరంజీవి, నయనతార అనిల్ రావిపూడి దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన మన శంకర్ వరప్రసాద్ గారు ఫ్యామిలీ ఎంటర్టైర్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈసినిమా బాక్సాఫీస్ వద్ద అద్భుత విజయాన్ని సొంతం చేసుకొని భారీ కలెక్షన్లను రాబడుతుంది. ఇప్పటికే ఈ సినిమా 300 కోట్ల క్లబ్ లో అడుగుపెట్టింది. తాజాగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ శంకర వరప్రసాద్ సినిమాపై సోషల్ మీడియా వేదికగా స్పందించారు..

సినిమాకి పోస్టర్ షేర్ చేస్తూ.. మన శంకర వరప్రసాద్ గారు సినిమా టీం మొత్తానికి అభినందనలు. ది బాస్ ఈజ్ బ్యాక్.. వింటేజ్ వైబ్స్ తో మన మెగాస్టార్ చిరంజీవి గారిని మళ్లీ తెరపై చూడటం చాలా సంతోషంగా ఉందన్నారు. వెంకీగౌడ పాత్రలో వెంకటేష్ అదరగొట్టారని అన్నారు. సినిమాలో నటించిన నయనతార, కేథరిన్ అద్భుతంగా నటించారని, బుల్ రాజు కూడా అదిరగొట్టాడంటూ అల్లు అర్జున్ ప్రశంసలు కురిపించారు.

సినిమాలో ప్రతీపాట విజిల్ వేయించేలా ఉందని, సినిమా కోసం పని చేసిన ప్రతి ఒక్క టెక్నీషియన్లకు, నిర్మాతలు సుస్మిత, సాహుకు అభినందనలు తెలియజేశారు. డైరెక్టర్ అనిల్ రావిపూడికి బిగ్గెస్ట్ కంగ్రాట్యులేషన్స్.. ఆయన సంక్రాంతికి వస్తారు, హిట్ కొడతారు… అనిల్ రావిపూడి సంక్రాంతి బ్లాక్ బస్టర్ మిషన్. అన్నారు. ఇది సంక్రాంతి ‘బాస్ ‘ బస్టర్ అంటూ ఈ సినిమాకు అల్లు అర్జున్ తన సుదీర్ఘమైన రివ్యూ రాసుకొచ్చారు. ఇదంతా సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతుంది.

అల్లు అర్జున్ ప్రస్తుతం అట్లీ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. ఈ సినిమా భారీ బడ్జెట్ తో తెరకెక్కుతుంది. సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. అట్లీ సినిమాతో పాటు లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు అల్లు అర్జున్. దాంతో ఐకాన్ స్టార్ అభిమానులు ఫుల్ ఖుష్ అవుతున్నారు. చిరంజీవిపై ప్రేమను చూపించడంతో బన్నీ ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు.

Comments are closed

Related Posts