కూటమి ప్రభుత్వం రాష్ట్రంలోని పేద ప్రజల ఇళ్ల నిర్మాణానికి ప్రాధాన్యత ఇస్తోంది. సీఎం చంద్రబాబు గారి ఆదేశాల మేరకు రాష్ట్రవ్యాప్తంగా ఇళ్ల నిర్మాణాలకు శంకుస్థాపన కార్యక్రమాలు జోరందుకున్నాయి. వైసీపీ ప్రభుత్వ హయాంలో ఊరి చివర, స్మశానాల పక్కన, పొలాల్లో ముంపునకు గురయ్యే ప్రాంతాల్లో ఇళ్లు ఇస్తే కూటమి సర్కార్ రేటు ఎక్కువ అయినా పర్లేదు.. మంచి నివాస స్థలాల్లో స్థలాలు ఇచ్చేందుకు ప్రయత్నిస్తోంది. రాష్ట్ర మంత్రులు సైతం ఇళ్ల స్థలాల విషయంలో ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా వ్యవహరిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే ఇళ్లు, ఇళ్ల స్థలాలతోపాటు 9ప్రధానమంత్రి ఆవాస్ యోజన గృహాల పనులను వేగవంతం చేస్తున్నారు.
తాజాగా మంత్రి అనగాని సత్య ప్రసాద్ ప్రాతినిధ్యం వహిస్తున్న రేపల్లె నియోజకవర్గంలోని లంకెవానిదిబ్బ గ్రామంలో మంత్రి కొలుసు పార్ధ సారథి తో కలిసి 39ప్రధానమంత్రి ఆవాస్ యోజన గృహాల నిర్మాణానికి శంకుస్థాపన చేసారు. రాష్ట్ర గృహనిర్మాణ సంస్థ మరియు VRO సంస్థ సంయుక్త సహకారంతో నిర్మిస్తున్న ఈ PMAY గృహాలను త్వరితగతిన పూర్తి చేసి అర్హులైన పేద కుటుంబాలకు అందించాలని అనగాని అధికారులకు ఆదేశాలు జారీ చేసారు. గత వైకాపా ప్రభుత్వం జగనన్న కాలనీల పేరుతో పేదల జీవితాలతో చెలగాటం ఆడిందని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అటు కేంద్ర ప్రభుత్వ సహకారంతో, ఇటు రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో PMAY, టిడ్కో ఇళ్ల నిర్మాణాలు శరవేగంగా జరుగుతున్నాయని అనగాని అన్నారు. రాష్ట్రంలోని పేదల సొంతింటి కల నెరవేర్చే దిశగా ఎన్డీయే కూటమి ప్రభుత్వం ముందడుగు వేస్తోందని తెలిపారు.














Comments are closed