Shopping cart

Subtotal $0.00

View cartCheckout

At Peoplespost News, we aim to give our readers clear and useful information. We focus on honest reporting and keeping you updated about important events around the world.

TnewsTnews
  • Home
  • Lifestyle
  • Entertainment
  • సామాన్లు కనపడేలా ఆ డ్రస్సులేంటీ..హీరోయిన్లపై శివాజీ షాకింగ్ కామెంట్స్..!

సామాన్లు కనపడేలా ఆ డ్రస్సులేంటీ..హీరోయిన్లపై శివాజీ షాకింగ్ కామెంట్స్..!

Shivaji comments

హీరోయిన్ల వస్త్రధారణపై సీనియర్ నటుడు శివాజీ చేసిన వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో దుమారం చెలరేగుతోంది. బిగ్ బాస్ షో తర్వాత నటుడిగా మళ్లీ బీజీగా మారిన శివాజీ వరుస సినిమాలు చేస్తున్నారు. తాజాగా శివాజీ కీ రోల్‌లో నటించిన దండోరా సినిమా క్రిస్మస్ రోజున విడుదల కాబోుంది. కాగా సోమవారం రాత్రి జరిగిన ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్‌‌కు చీర కట్టుకుని వచ్చిన యాంకర్ ప్రశాంతిని ఉద్దేశిస్తూ కితాబు ఇచ్చారు. ఈ సందర్భంగా హీరోయిన్లు గ్లామర్ పేరుతో హద్దులు దాటవద్దని సూచిస్తూ…ఆయన బూతుపదంతో చేసిన వ్యాఖ్యలపై బీభత్సమైన ట్రోలింగ్ జరుగుతుంది…

అమ్మాయిలు, హీరోయిన్లు తమ శరీర భాగాలు కనిపించేలా బట్టలు వేసుకుని పోతే మనమే దరిద్రం అనుభవించాల్సి వస్తుందమ్మా అంటూ హితవు పలకబోయారు. మీ అందనిండుగా కప్పుకునే బట్టల్లోనే ఉంటుంద తప్పితే ..సామాన్లు కనపడే బట్టలు వేసుకుంటే ఎలా…అలా చూసినప్పుడు అందరూ పైకి నవ్వుతారు కానీ..దరద్రపు ము….ఇలాంటి బట్టలు ఎందుకు వేసుకుంది అని లోలోపల తిట్టుకుంటారని.. అసలు చీర కట్టుకున్నవాళ్లకే మిస్ వరల్డ్, యూనివర్స్ కిరీటాలు వచ్చాయి…అంటూ శివాజీ చేసిన వ్యాఖ్యలు నెట్టింట వివాదాస్పదంగా మారాయి. కొందరు శివాజీ మాటల్లో తప్పేం లేదు…కొందరు హీరోయిన్లు యూత్‌ను రెచ్చగొట్టేలా పబ్లిక్‌గా వల్గర్‌గా డ్రెస్సులు వేసుకుంటున్నారని, పబ్లిక్ ఫంక్షన్‌లలో కాస్త పద్దతిగా వస్తుంటే బాగుంటుంది అంటూ సమర్థిస్తూ ఉండగా.. మగవారి చూపులో కాంక్ష ఉన్నవారికి ఇలాగే అనిపిస్తుందని… అసలు ఆడవారి శరీర భాగాలను సామాన్లు అంటూ వల్గర్‌గా కించపర్చి మగబుద్ధిని చాటుకున్నాడని మరికొంత మంది శివాజీపై మండిపడుతున్నారు.


మరోవైపు శివాజీ కామెంట్స్‌పై సింగర్ చిన్మయి మండిపడింది. తెలుగు నటుడు శివాజీ ఓ అద్భుతమైన సినిమాలో విలన్‌గా నటించాడు. పోకిరీలు మాట్లాడే బూతు పదాలతో హీరోయిన్లకు అనవసర సలహాలు ఇస్తున్నాడు..పోకిరీలకు శివాజీ హీరో అయిపోయాడు..ఆయనేమో జీన్స్, హుడీ వేసుకున్నాడు..ఆయన చెప్పినట్లు ధోతీ, పంచె కట్టుకోవాలి…పెళ్లి అయితే బొట్టు, కాళ్లకు మెట్టెలు పెట్టుకోవాలి.. అసలు సినిమా రంగంంలో మహిళలను ఎలా చూస్తున్నారో అర్థమవుతోంది. అంటూ చిన్మయ్ ఓ రేంజ్‌లో ఫైర్ అయింది. మరోవైపు తన వస్త్రధారపై కామెంట్స్ చేసేవారి తాట తీసే అనసూయ కూడా ఇది మా బాడీ… మా ఇష్టం” అంటూ చిన్న ట్వీట్‌తో శివాజీ వ్యాఖ్యలకు పరోక్షంగా కౌంటర్ ఇచ్చింది.. ప్రస్తుతం శివాజీ చేసిన కామెంట్స్ పై కాంట్రవర్సీగా మారాయనే చెప్పాలి.

Comments are closed

Related Posts