Shopping cart

Subtotal $0.00

View cartCheckout

At Peoplespost News, we aim to give our readers clear and useful information. We focus on honest reporting and keeping you updated about important events around the world.

TnewsTnews
  • Home
  • Telangana
  • Hyderabad
  • Anasuya Overaction : శివాజీని మళ్లీ కెలికిన అనసూయ

Anasuya Overaction : శివాజీని మళ్లీ కెలికిన అనసూయ

సినిమా ఈవెంట్లలో హీరోయిన్ల డ్రెస్సింగ్‌పై నటుడు శివాజీ చేసిన వ్యాఖ్యలు భారీ చర్చకు దారి తీసిన విషయం తెలిసిందే. పబ్లిక్ వేదికలపై మహిళలు పద్ధతిగా ఉండాలంటూ శివాజీ చేసిన కామెంట్లపై తీవ్ర దుమారం రేగింది. కొందరు శివాజీని సపోర్ట్ చేయగా మరికొందరు వ్యతిరేకించారు. అయితే ఈ అంశంపై యాంకర్ అనసూయ తీవ్రంగా స్పందిస్తూ వరుసగా కౌంటర్లు ఇస్తోంది. సోషల్ మీడియా వేదికగా శివాజీని టార్గెట్ చేస్తూ వీడియోలు, పోస్టులు పెట్టడంతో ఈ వివాదం మరింత ముదురుతోంది. ఈ అంశాన్ని ఇక్కడితో వదిలేయాలని శివాజీ కోరినా, అనసూయ మాత్రం ఆగడం లేదని అందరూ అభిప్రాయపడుతున్నారు. ఇదిలా ఉండగా తాజాగా తమిళ హీరో విజయ్‌కు ఎదురైన ఒక అనూహ్య ఘటనను ఉదహరిస్తూ అనసూయ చేసిన ట్వీట్ ఇప్పుడు మరో వివాదానికి కారణమైంది. మలేషియాలో విజయ్ చివరి సినిమా ‘జన నాయగన్’ ఆడియో లాంచ్ జరిగింది. ఈ ఈవెంట్ మొత్తం అత్యంత పకడ్బందీగా, ఆర్గనైజ్డ్‌గా జరిగింది. లక్షలాదిమంది అభిమానులు హాజరైనప్పటికీ అక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోలేదు. అయితే, అదే ఈవెంట్ ముగిసిన తర్వాత భారత్‌కు తిరిగొచ్చిన సందర్భంలో చెన్నై ఎయిర్‌పోర్ట్ వద్ద విజయ్ ను అభిమానులు చుట్టుముట్టారు. విజయ్ ను ముట్టుకునేందుకు ప్రయత్నిస్తూ ఇబ్బందికి గురిచేసారు.. అంశాన్ని రీట్వీట్ చేస్తూ అనసూయ నేనేమీ అనట్లేదు అంటూ కామెంట్ చేయడం మరో చర్చకు దారితీసింది.

Comments are closed

Related Posts