At Peoplespost News, we aim to give our readers clear and useful information. We focus on honest reporting and keeping you updated about important events around the world.
తెలుగులో ‘సూపర్’ చిత్రంతో అరంగేట్రం చేసి ‘అరుంధతి’ సినిమాతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుని, లేడీ ఓరియెంటెడ్ సినిమాలతో మంచి బిజినెస్ తెచ్చిపెట్టింది అనుష్క. ప్రభాస్, అనుష్క కాంబినేషన్ అయితే ఫ్యాన్స్‌కు పూనకాలే అని చెప్పొచ్చు. వీరి కాంబినేషన్లో వచ్చిన ‘మిర్చి’, ‘బాహుబలి 1, బాహుబలి2’ సినిమాలు దేశవ్యాప్తంగా రికార్డులు సృష్టించాయి. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన సినీ కెరీర్లో ఓ పెద్ద మిస్టేక్ చేశానని చెప్పింది అనుష్క..
తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఓ సినిమా చేయడమే తాను చేసిన సినిమా అని పేర్కొంది. ఇంతకీ ఆ సినిమా ఏంటంటే.? ఒక్క మగాడు.. 2008లో సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిందా సినిమా. నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా వైవిఎస్ చౌదరి దర్శకత్వం వహించిన ఆ సినిమా బాక్సాఫీస్ దగ్గర అట్టర్ ప్లాప్ అయింది. బాలకృష్ణ కెరీర్లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్‌గా మారింది.ఒకప్పుడు బాలకృష్ణ – వైవియస్ చౌదరి కాంబినేషన్‌కు మంచి క్రేజ్ ఉండేది.. ఆ సమయంలో అనుష్కకు పూర్తిస్థాయిలో మేనేజర్లు, అడ్వైజర్లు లేకపోవడంతో ఆ సినిమా పూర్తి కథ వినకుండానే స్వీటీ ఓకే చెప్పిందట. అలాగే సినిమాలో తనపాత్ర స్కోప్ ఎంతుందో తెలుసుకోకుండానే గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట.
ఈ విషయాలను స్వయంగా అనుష్క తాజాగా ఓ ఇంటర్వ్యూలో అనుష్క వెల్లడించింది. పైగా ఒక్క మగాడు సినిమాలోని ఓ పాటలో అనుష్క ఎంతో బోల్డ్‌గా కనిపించింది. ఇప్పటికీ ఆ పాటతో స్వీటీ పలు విమర్శలు, సోషల్ మీడియాలో ట్రోలింగ్ ఎదుర్కుంటోంది. సినిమా ఫ్లాప్ అయినప్పటికీ బాలకృష్ణతో నటించడం తనకు మంచి అనుభవమని.. ఆయన చాలా మంచిమనిషి అని అనుష్క పేర్కొంది. ఆ సినిమా ఫలితం తర్వత నుంచి కథ, తన పాత్ర నిడివి తెలుసుకోకుండా ఏ సినిమా ఒప్పుకోలేదని, ఆపై తన సినిమాల ఎంపిక మరింత జాగ్రత్తగా ఉందని తెలిపింది.
బాలయ్యతో ఆ సినిమా చేసి తప్పు చేసా అంటున్న స్వీటీ.. ఎందుకంటే.?

Related Tags: