Shopping cart

Subtotal $0.00

View cartCheckout

At Peoplespost News, we aim to give our readers clear and useful information. We focus on honest reporting and keeping you updated about important events around the world.

TnewsTnews
  • Home
  • desk
  • ఎంతోమందికి న్యాయం చేసిన ఆ గడప సాయం కోసం ఎదురుచూస్తోంది..

ఎంతోమందికి న్యాయం చేసిన ఆ గడప సాయం కోసం ఎదురుచూస్తోంది..

అవనిగడ్డ నియోజకవర్గం, కోడూరు మండలం, పోటుమీద గ్రామంలో ఆ కుటుంబం ఒకప్పుడు ఊరిని ఏలింది.. ఎంతోమందికి సాయం అందించింది. ఆ గడపతొక్కిన ఎంతోమందికి న్యాయం జరిగింది. కానీ ఇప్పుడు ఆ ఇంటి వారసుడికే అన్యాయం జరుగుతోంది. పదిమందికి అండగా నిలబడాల్సిన ఆ కుటుంబం ఇప్పుడు న్యాయం కోసం రోధిస్తోంది.. పోటుమీద గ్రామ మాజీ సర్పంచ్ కొడవకల్లు నాగేశ్వరరావు గారి ఏకైక కుమారుడు పూర్ణచంద్రరావు ఆకస్మిక మరణం ఆ కుటుంబ పరిస్థితులను తలక్రిందులు చేసాయి.. భర్త మరణించడంతో పూర్ణచంద్రరావు భార్య గాయత్రి భర్తలేని బాధను దిగ మింగుకుని, మామ గారి గౌరవాన్ని కాపాడుకుంటూ ఐదేళ్లపాటు కన్నీటిని దిగమింగుకుంటూ కాలం వెళ్లదీసింది.. “మామ గారు ఉన్నారు కదా.. ఆయన మనవడికి న్యాయం చేస్తారు” అని భావించింది. మనమడే పంచప్రాణాలుగా భావించే మామగారు కూడా మరణించడంతో గాయత్రిని, ఆమె కుమారుడిని మామగారి కూతుళ్లు ఏకాకిని చేసారు.

కోట్లాది రూపాయల ఆస్తి ఉన్నా, ఆకుటుంబ వారసుడి భవిష్యత్తు కోసం నాగేశ్వరావు రావు గారి ఇద్దరు కుమార్తెలు ఒక్క రూపాయి కూడా ఇవ్వడం లేదు. పెద్ద కూతురు గాదె రామలక్ష్మి – ఆమె భర్త గాదె వెంకట రాజేంద్ర ప్రసాద్ (HMDA HYD గవర్నమెంట్ ఉద్యోగి) అలాగే రెండవ కూతురు స్వర్ణలత – ఆమె భర్త బల్లెపు వెంకటరమణ (గవర్నమెంట్ లెక్చరర్) వారంతా ఆర్ధికంగా స్థిరపడినా న్యాయంగా మేనల్లుడికి చెందాల్సిన ఆస్తిని కాజేసేందుకు ప్రయత్నిస్తున్నారు..

తాత ఆస్తి మనమడికి చెందాలన్న కనీస న్యాయాన్ని అతిక్రమిస్తూ పొలాల లీజు డబ్బులు, కౌలు ఆదాయాన్ని అక్రమంగా లాక్కుంటున్నారు. భర్త, మామగార్ల మరణంతో గాయత్రి తన బిడ్డకు జరుగుతున్న అన్యాయంపై ఎంత రోధిస్తున్నా ఆమె కన్నీటి గాధను వినకుండా, వారసుడి భవిష్యత్తు గురించి ఆలోచించకుండా, ఉన్న అన్ని ఆస్తులను దోచుకుంటున్నారు.

గ్రామప్రజలంతా ఈ అన్యాయాన్ని చూసి మిన్నకుండిపోతున్నారు. జరుగుతున్నది అన్యాయం అని తెలిసినా పెద్దాయన లేని కుటుంబ వారసుడి ఆస్తులు కాజేస్తున్న వైనం కళ్లెదట కనబడుతున్నా.. కుటుంబ వ్యవహారం కాబట్టి ఎవరూ ప్రశ్నించలేకపోతున్నారు.

భర్త మామ మరణం తో కుటుంబ బాధ్యతను తీసుకున్న గాయత్రి స్థానిక ఒడ్ల వ్యాపారి ఆలపర్తి రాముని కౌలు డబ్బులు అడగగా,కౌలు డబ్బులు,లీజు డబ్బులు తో మీకేం సంబంధం అంటూ ఎదురు తిరిగాడంటే ఏస్థాయిలోకూతుర్లు, అల్లుళ్ళు వారి ఆస్తులపై రాబందుల్లా పడి అందరినీ ఎలా మ్యానేజ్ చేస్తున్నారో అర్ధం చేసుకోవచ్చు…. ఎన్నో సార్లు సాయం పొందిన ఆ ఊరి జనం, కుటుంబ సభ్యులు కూడా అన్యాయం జరుగుతున్న చేతులు కట్టుకు కూర్చున్నారు… డబ్బు ఎటు ఉంటే మనిషి అటువైపే ఉంటాడు అనటానికి ఇదొక నిదర్శనం….

Comments are closed

Related Posts