Shopping cart

Subtotal $0.00

View cartCheckout

At Peoplespost News, we aim to give our readers clear and useful information. We focus on honest reporting and keeping you updated about important events around the world.

TnewsTnews
  • Home
  • Telangana
  • Scam.. భూభారతిలో అక్రమాలపై ప్రభుత్వం సీరియస్..

Scam.. భూభారతిలో అక్రమాలపై ప్రభుత్వం సీరియస్..

భూ భారతి వ్యవస్థలో భారీ స్థాయి అక్రమాలు జరుగుతున్నట్లు అధికారుల విచారణలో వెలుగులోకి వస్తోంది. యాదాద్రి భువనగిరి, జనగామ జిల్లాల్లోనే సుమారు రూ.70 కోట్ల వరకు అక్రమ లావాదేవీలు జరిగినట్లు ప్రాథమికంగా గుర్తించారు. ఈ కేసులో భాగంగా యాదాద్రి భువనగిరి, జనగామ జిల్లాల్లోని మీ సేవ, ఇంటర్నెట్ సెంటర్లు, ఆన్‌లైన్ సేవా కేంద్రాలకు చెందిన 16 మందిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. వీరి బ్యాంకు ఖాతాల్లో ఒక్కొక్కటిగా రూ.30 నుంచి రూ.40 లక్షల వరకు డిపాజిట్లు జరిగినట్లు గుర్తించగా, సంబంధిత ఖాతాలను సీజ్ చేశారు.

యాదాద్రి భువనగిరి జిల్లాలో మాత్రమే ఇప్పటివరకు 1,372 డాక్యుమెంట్లను పరిశీలించగా, వాటిలో రూ.4 కోట్లకు పైగా అక్రమాలు జరిగినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ అక్రమాలపై ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. రాష్ట్రవ్యాప్తంగా రెవెన్యూ, విజిలెన్స్, స్పెషల్ బ్రాంచ్, ఇంటెలిజెన్స్ వింగ్‌లను రంగంలోకి దించి సమగ్ర విచారణకు ఆదేశాలు జారీ చేసింది. జిల్లా స్థాయిలో సీఐలు, ఎస్ఐలతో ప్రత్యేక టీంలను ఏర్పాటు చేసి క్షేత్రస్థాయిలో విచారణను ముమ్మరం చేశారు.

Comments are closed

Related Posts