మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ అవైటెడ్ చిత్రమే “పెద్ది”. ఈ సినిమా ఇప్పటికే మంచి అంచనాలు సెట్ చేసుకుంది. దర్శకుడు బుచ్చిబాబు ఈ సినిమాను తెరకెక్కిస్తుండగా జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటించింది. ఇక ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా పూర్తవుతుండగా మేకర్స్ రీసెంట్ గా షెడ్యూల్ కూడా రీస్టార్ట్ చేసారు.
షూటింగ్ నుండి రామ్ చరణ్ పిక్స్ లీకయ్యి సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ షెడ్యూల్ పైనే టాలెంటెడ్ సినిమాటోగ్రాఫర్ లేటెస్ట్ అప్డేట్ అందించారు. ఢిల్లీ షెడ్యూల్ ని మేకర్స్ సక్సెస్ ఫుల్ గా కంప్లీట్ చేసినట్టు తెలిపారు. పోయెటిక్ గా లీనమయ్యిపోయే సీన్స్ తీసినట్టు మేకర్స్ తెలిపారు.
అలాగే చరణ్ ఎప్పటిలానే తన బెస్ట్ ఇచ్చారంటూ దర్శకుడు బుచ్చిబాబుతో కలిసి పిక్స్ ని తాను షేర్ చేసుకున్నారు. దీంతో చరణ్ ఫ్యాన్స్ మరింత ఎగ్జైట్ అవుతున్నారు. ఇక ఈ చిత్రానికి ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందిస్తుండగా వృద్ధి సినిమాస్, మైత్రి మూవీ మేకర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.









Comments are closed