తెలంగాణ రైజింగ్ పేరుతో హైదరాబాద్ లో నిర్వహించినపెట్టుబడుల సదస్సు పొలిటికల్ ఈవెంట్ కాదు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వ్యవహారం కాదు. సమ్మిట్ ద్వారా ఎంత పెట్టుబడి వచ్చినా అవి రాష్ట్రానికి, ప్రజలకు మేలు చేస్తాయి.. అయితే విపక్ష బీఆర్ఎస్ మాత్రం తన ప్రజావ్యతిరేక వక్రబుద్ధిని చూపిస్తూనే ఉంది. సమ్మిట్ ప్రారంభానికి ముందు నుంచే సమ్మిట్ పై వ్యతిరేక ప్రచారం ప్రారంభించారు. కార్యక్రమాన్ని టెంట్లలో చేస్తున్నారని, కాంట్రాక్టర్లు ఏపీకి చెందినవారనే విమర్శలు ప్రారంభించారు. అనంతరం ఎంఓయూలు చేసుకున్న సమయంలోనూ వాటిపై దుష్ప్రచారం హోరెత్తించారు.
సోషల్ మీడియాలో పాత కంపెనీలతోనే మళ్లీ పెట్టుబడుల ఒప్పందం చేసుకుంటున్నారని, సదరు కంపెనీలు దివాలా తీసాయని ప్రచారం చేసారు. ఈ వ్యతిరేక ప్రచారం చాలా ఉద్ధృతంగా ఒక పద్ధతి ప్రకారం పార్టీ ప్రముఖుల ఆదేశానుసారం జరిగినట్టు స్పష్టంగా అర్ధమవుతోంది. మరోవైపు పెట్టుబడుల సదస్సు గురించి ఎక్కడా పాజిటివ్ గా చెప్పకపోయినా వ్యతిరేక ప్రచారం చేసే విషయంలో కాస్త సంయమనం పాటిస్తే బాగుండేదన్న అభిప్రాయం వినిపిస్తోంది.
ఇతర దేశాలనుండి, దేశవ్యాప్తంగా ఇతర ప్రాంతాలనుండి తెలంగాణకు వచ్చిన పారిశ్రామిక వేత్తలు ఇక్కడ కలుషిత రాజకీయ వాతావరణం ఉందనుకునేలా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ ప్రచారం చేసిన విధానాన్ని న్యూట్రల్ ప్రజలే అసహ్యించుకున్నారు.
అలాగే ప్రభుత్వం డమ్మీ ఎంవోయూలు చేసుకుంటే వాటిని బయట పెట్టి.. సమ్మిట్ లో లోపాలను పద్ధతి ప్రకారం ఎత్తి చూపాల్సి ఉంది. కానీ అసలు సమ్మిట్ ప్రారంభం కాకముందే.. వ్యతిరేకించాలి.. నెగెటివ్ ప్రచారం చేయాలి అనేలా వ్యవహరించడంపై సామాన్యులు సైతం బీఆర్ఎస్ విధానాన్ని వ్యతిరేకిస్తున్నారు.














Comments are closed