Shopping cart

Subtotal $0.00

View cartCheckout

At Peoplespost News, we aim to give our readers clear and useful information. We focus on honest reporting and keeping you updated about important events around the world.

TnewsTnews
  • Home
  • Andhra Pradesh
  • మారేడుమిల్లిలో ఘోరం.. బస్సు ప్రమాదంలో 15మంది మృతి..

మారేడుమిల్లిలో ఘోరం.. బస్సు ప్రమాదంలో 15మంది మృతి..

ఏపీలోని అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. చిత్తూరు జిల్లాకు చెందిన ఓ ప్రైవేటుబస్సు అదుపుతప్పి లోయలో పడింది. ఈ ప్రమాదంలో 15కి పైగా మృతి చెందినట్లు సమాచారం. చింతూరు నుంచి మారేడుమిల్లి వెళ్తున్న బస్సు ఘాట్‌రోడ్డు వద్ద ఒక్కసారిగా లోయలోకి దూసుకెళ్లింది. ఘటనాస్థలి వద్ద ప్రయాణికులు హాహాకారాలు చేసారు.. వెంటనే సమాచారం అందుకున్న పోలీసులు, స్థానికులతో కలిసి సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదం జరిగిన బస్సులో నిండుగా ప్రయాణికులున్నారు. భద్రాచలంలో ఆలయ దర్శనం చేసుకొని అన్నవరానికి వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్టు తెలుస్తోంది. అయితే బస్సు ప్రమదానికి అతివేగం కారణమా.. లేదా బ్రేక్ ఫెయిల్ అయిందా అన్నది తెలియాల్సి ఉంది.

చింతూరు వద్ద జరిగిన బస్సు ప్రమాద ఘటనపై వైద్య ఆరోగ్య శాఖ మంత్రి శ్రీ సత్యకుమార్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసారు. క్షతగాత్రులకు వైద్య సేవలు కొనసాగించడంపై జిల్లా కలెక్టర్తో మాట్లాడారు. చింతూరు సామాజిక ఆసుపత్రిలో క్షతగాత్రులకు వైద్య సేవలు ప్రత్యేక వైద్య ఉృందాలు ఏర్పాటు చేసి క్షతగాత్రుల్లో కొందరిని మెరుగైన వైద్యం కోసం భద్రాచలం అసుపత్రికి తరలించారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని వెల్లడించారు.

Comments are closed

Related Posts