బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డిపై (BRS MLA Kotha Prabhakar Reddy) కేసు నమోదు అయ్యింది. దుర్గంచెరువు వద్ద స్థలం ఆక్రమణ ఆరోపణల నేపథ్యంలో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేతో పాటు వెంకట్ రెడ్డిలపై మాదాపూర్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు అయ్యింది. బీఎన్‌ఎస్ 329(3), 3(5) సెక్షన్లు, PDPP యాక్ట్ సెక్షన్ 3 కింద పోలీసులు కేసు నమోదుచేశారు. దుర్గంచెరువు దగ్గర ఐదు ఎకరాలు కబ్జాచేసి ఆక్రమించిన స్థలాన్ని ప్రైవేటు ఆపరేటర్లకు అద్దెకు ఇచ్చినట్లు హైడ్రా అధికారులు గుర్తించారు.
చెరువు ప్రాంతాన్ని మట్టి, రాళ్లతో నింపినట్టు ఆరోపణలు వచ్చాయి. అక్రమంగా ఆక్రమించిన భూమిని STS ప్రైవేట్ ట్రాన్స్‌పోర్ట్ పార్కింగ్‌గా వినియోగానికి ఇచ్చినట్లు హైడ్రా గుర్తించింది. 2014లోనే హెచ్‌ఎమ్‌డీఏ ఎఫ్‌టీఎల్ ప్రాథమిక నోటిఫికేషన్ జారీచేసింది. అయితే నోటిఫికేషన్ ఉన్నప్పటికీ ఆక్రమించినట్లు ఫిర్యాదు వచ్చింది. ఆక్రమించిన భూమి ద్వారా నిందితులు అక్రమ ఆదాయం పొందుతున్నారని ఆరోపణలున్నాయి. ఈఆక్రమణలపై హైడ్రా సూపర్వైజర్ క్రాంతిఆనంద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈమేరకు కేసునమోదు చేసిన మాదాపూర్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు.














Comments are closed