స్విట్జర్లాండ్ లోని దావోస్ లో జరిగే వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ సదస్సులో పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, దిగ్గజ వ్యాపారవేత్తలు తదితరులు పాల్గొంటుంటారు. ఈక్రమంలో దావోస్ కు ఏపీ నుంచి సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్, ఎంపీ టీజీ భరత్, పలువురు అధికారులు, తెలంగాణ నుంచి సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు పొంగులేటి, శ్రీధర్ బాబు తదితరులు హాజరయ్యారు. అయితే వీరితోపాటు మెగాస్టార్ చిరంజీవి దావోస్ కు వెళ్లారు.
దావోస్ లోని డబ్ల్యూఈఎఫ్ సదస్సులో చిరంజీవి పాల్గొని ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. జాయిన్ ది రైజ్ కార్యక్రమంలో తెలంగాణ విజన్ ప్రజెంటేషన్ ను చిరు ఆసక్తిగా తిలకించారు. అనంతరం సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులతో కలిసి భోజనం కూడా చేశారు. అయితే, దావోస్ టూర్ కు ఏమాత్రం సంబంధం లేని చిరంజీవి అక్కడకు ఎందుకు వెళ్లారు అన్న విషయంపై ఇప్పటికీ క్లారిటీ లేదు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి.
డిసెంబర్ 2025లో జరిగిన ‘తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2025’లో చిరంజీవి ముఖ్య అతిథిగా పాల్గొన్న సంగతి తెలిసిందే. దీంతో, చిరు తెలంగాణ రాజకీయాల్లో అడుగుపెడతారా అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ వినిపిస్తున్నాయి. దాంతోపాటు చిరంజీవి హైదరాబాద్ లో ఫిల్మ్ ఇండస్ట్రీ అభివృద్ధికోసం ఇక్కడ అవసరమైన పెట్టుబడులు, అవకాశాల గురించి చర్చించడానికి దావోస్ వెళ్లారని అంటున్నారు. కానీ అధికారికంగా చిరంజీవి పర్యటనపై ఎలాంటి సమాచారం లేదు.











Comments are closed