హనుమకొండ జిల్లాలో సంచలనం రేపిన అక్షర చిట్ఫం డ్ కేసులో కీలకపరిణామం చోటు చేసుకుంది. అక్షర చిట్ ఫండ్ సంస్థ డైరెక్టర్ శ్రీవిద్యను పోలీసులు బెంగళూరు విమానాశ్రయంలో అరెస్ట్ చేశారు. అమెరికా నుంచి భారత్‌కు చేరుకున్న ఆమెను అదుపులోకి తీసుకుని హనుమకొండకు తరలించారు.
వందలాదిమంది చిట్ కట్టినవారికి గడువు ముగిసిన తరువాత డబ్బులు చెల్లించకుండా మోసంచేసినట్లు ఆరోపణలు వెల్లువెత్తడంతో బాధితులు సుబేదారి పోలీస్ స్టేషన్‌లో శ్రీవిద్యపై ఫిర్యాదు చేశారు. ఇప్పటికే సంస్థ చైర్మన్ శ్రీనివాస్ రావుపైనా కేసులు నమోదు చేసి రెండు సార్లు జైలుకు పంపిన విషయం తెలిసిందే. మరో రెండుకేసుల్లో శ్రీనివాసరావు, ఆయన భార్య శ్రీ విద్య నిందితులుగా ఉన్నారు.
పోలీసులకు చిక్కకుండా గత కొంతకాలంగా తప్పించుకుని తిరుగుతున్న శ్రీ విద్యను గతరాత్రి బెంగళూరు ఎయిర్‌పోర్టులో అరెస్ట్ చేసినట్లు సుబేదారి ఇన్‌స్పెక్టర్ రంజిత్ వెల్తెలడించారు. అనంతరం ఆమెను హనుమకొండ జిల్లా కోర్టులో హాజరుపరిచి న్యాయమూర్తి ఆదేశాల మేరకు రిమాండ్‌కు తరలించారు. ప్రస్తుతం నర్సంపేట జైలుకు తరలించినట్లు పోలీసు అధికారులు వెల్లడించారు.









Comments are closed