ఆర్టీసీ ఉద్యోగులకు కూటమి ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. మెడికల్ గా అన్ ఫిట్ అయిన ఆర్టీసీ ఉద్యోగులకు ప్రత్యామ్నాయ ఉద్యోగాలివ్వాలని నిర్ణయిస్తూ ఆదేశాలు జారీచేసింది. ఆర్టీసీ ప్రభుత్వంలో విలీనం అయిన తర్వాత మెడికల్ అన్ ఫిట్ అయిన ఉద్యోగులకు ప్రత్యామ్నాయ ఉద్యోగాలివ్వాలని సర్కార్ నిర్ణయించింది. దీంతో 2020 జనవరి 1తర్వాత మెడికల్ అన్ ఫిట్ అయిన ఉద్యోగులకు ప్రత్యామ్నాయ ఉద్యోగాలివ్వనున్నారు. దాంతో ఆర్టీసీలో డ్రైవర్లు, కండక్టర్లు, సహా మిగిలిన ఉద్యోగులందరికీ ప్రత్నామ్నాయ ఉద్యోగాలివ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది.
రోడ్ ట్రాన్స్ పోర్ట్ కార్పోరేషన్‌లో ఉండగా మొత్తం 21కేటగిరీలో మెడికల్ అన్ ఫిట్ అయినవారికి ప్రత్నామ్నాయ ఉద్యోగాలు ఇస్తారు. విలీనం తర్వాత కూడా 21కేటగిరీల్లో మెడికల్ అన్ ఫిట్ అయిన వారికి ప్రత్యామ్నాయ ఉద్యోగాలు ఇవ్వాలివ్వాలని కూటమి సర్కార్ నిర్ణయించింది. మెడికల్ అన్ ఫిట్ అయిన వారికి కండక్టర్, రికార్డు ట్రేసర్, అసిస్టెంట్ మెకానిక్ లేదా శ్రామిక్ ఉద్యోగాలివ్వాలని నిర్ణయం తీసుకుంది. అలా ఆర్టీసీలో ఇచ్చే ఉద్యోగానికి అర్హత లేకపోతే ప్రభుత్వ విభాగాల్లో అర్హతను బట్టి వేరే ఉద్యోగాలివ్వాలని ఆదేశాలు జారీ చేసారు. ఆయా జిల్లా కలెక్టర్ల ద్వారా ప్రభుత్వ విభాగాల్లో అర్హతమేరకు ఉద్యోగాలివ్వాలని, ఏ ఉద్యోగానికీ అర్హత లేనివారికి అదనపు ప్రయోజనాలు ఇవ్వాలని స్పష్టం చేసింది.
మెడికల్ అన్ ఫిట్ వల్ల వాలంటరీ రిటైర్డ్ కావాలనుకునేవారికి అదనపు ప్రయోజనాలు చేకూరేలా చర్యలు తీసుకోవాలని ఎపీపీటీడీ కమిషనర్‌కు ప్రభుత్వం కీలక ఆదేశాలిచ్చింది. అలాగే తదుపరి చర్యలు తీసుకోవాలని అన్ని జిల్లాల కలెక్టర్లకు సర్కార్ ఆదేశించింది. ఈమేరకు ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎం.టి .కృష్ణబాబు ఉత్తర్వులు జారీ చేశారు. ఇలా ఆర్టీసీలో ఉద్యోగులందరికీ ప్రయోజనాలివ్వడంపై ఉద్యోగ సంఘాలు హర్షం వ్యక్తంచేస్తున్నాయి. ఈమేరకు సీఎం చంద్రబాబుకు ఆర్టీసీ ఎన్‌ఎంయూఎ నేతలతో పాటు ఆర్టీసీ ఈయూ, కార్మిక పరిషత్ నేతలు ధన్యవాదాలు చెప్తున్నారు.















Comments are closed