ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్విట్జర్లాండ్ చేరుకున్నారు. దావోస్‌లో జరగనున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ (WEF) 2026 వార్షిక సదస్సులో పాల్గొనేందుకు ఆయన జ్యూరిచ్ విమానాశ్రయానికి చేరుకోగా, స్విట్జర్లాండ్ & లీచ్టెన్‌స్టెయిన్ భారత రాయబారి అంబర్ కుమార్ వారికి సాదర స్వాగతం పలికారు.
ఆంధ్రప్రదేశ్‌ను పరిశ్రమలు, సాంకేతికత మరియు ఆవిష్కరణలకు గమ్యస్థానంగా మార్చడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి ఈ పర్యటన సాగిస్తున్నారు. అంతర్జాతీయ వేదికలపై రాష్ట్రాన్ని ప్రమోట్ చేయడంలో సిద్ధహస్తుడైన చంద్రబాబు, ఈ సదస్సు ద్వారా విదేశీ పెట్టుబడులను (FDI) ఆకర్షించడమే కాకుండా, సరిహద్దు భాగస్వామ్యాలను బలోపేతం చేసే దిశగా అడుగులు వేస్తున్నారు.
“ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పరిశ్రమలు మరియు సాంకేతిక రంగాలలో అద్భుతమైన వృద్ధిని కనబరుస్తోంది. ప్రపంచ స్థాయి పెట్టుబడులకు, భాగస్వామ్యాలకు ఏపీ అత్యంత అనుకూలమైన వేదిక.” అని భారత రాయబార కార్యాలయం సోషల్ మీడియా వేదికగా పేర్కొంది.















Comments are closed