స్విస్ లో భారత రాయబారి మృదుల్ కుమార్ తో సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ భేటీ
జ్యురిచ్ (స్విట్జర్లాండ్): స్విట్జర్లాండ్ లో భారత రాయబారి మృదుల్ కుమార్ తో రాష్ట్ర విద్య, ఐటి శాఖల మంత్రి నారా లోకేష్ మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ… స్విట్జర్లాండ్ తో వాణిజ్య సంబంధాలను బలోపేతం చేసుకునేందుకు ఆంధ్రప్రదేశ్ ఆసక్తిగా ఉందని చెప్పారు. ఇందుకోసం స్విస్ కంపెనీలకు ఆహ్వానం పలుకుతున్నామని తెలిపారు. టెక్నాలజీ, టెక్స్ టైల్, యంత్రాల తయారీ, హార్డ్ వేర్, ఎలక్ట్రానిక్స్, రైలు, రైలు విడిభాగాల తయారీ, ఫార్మాస్యూటికల్స్, ఆర్ అండ్ డి సెంటర్స్, విశ్వవిద్యాలయాలతో సహకారం వంటి రంగాల్లో మేం స్విస్ సహకారాన్ని కోరుకుంటున్నాం. నెస్లే, రోచె, నోవార్టిస్, ఎబీబీ, లైబెర్ ఇంజనీరింగ్, క్లారియంట్, హిల్టి, బుహ్లర్, బుచర్, ఫెర్రింగ్ ఫార్మాస్యూటికల్స్, ఎస్ టీ టెలిమీడియా, ఓసీ ఓర్లికాన్ వంటి కంపెనీలు తమ యూనిట్లను ఏపీలో నెలకొల్పేలా ప్రోత్సహించండి. స్విస్ లోని జ్యురిచ్ విశ్వవిద్యాలయం, బాసెల్ యూనివర్సిటీ, బెర్న్ యూనివర్సిటీ, జెనీవా విశ్వవిద్యాలయం వంటి ప్రఖ్యాత వర్సిటీలను ఏఐ, ఫార్మా, మెడికల్ డివైస్, స్టార్టప్, ఎక్స్చేంజి ప్రోగ్రామ్ లపై ఏపీ వర్సిటీలను అనుసంధానించడంలో మద్దతు ఇవ్వండి.















Comments are closed