ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో ఐకానిక్ భవనాలు పూర్తయ్యేనాటికి పూర్తిస్థాయిలో స్టార్ హోటల్స్ కూడా అందుబాటులోకి వచ్చేలా ప్రభుత్వం ప్లాన్ చేస్తుంది.. ఇప్పటికే మూడు పెద్ద స్టార్ హోటల్స్ ప్రాజెక్టులకు భూమి పూజలు కూడా జరిగాయి. దసపల్లా, నోవోటెల్, తాజ్ వివాంతా – ఈ మూడు కలిపి సుమారు రూ.620కోట్ల పెట్టుబడి పెడుతున్నాయి. రూ.200కోట్లతో 4-స్టార్ హోటల్‌ను దసపల్లా నిర్మిస్తోంది. మొత్తం రెండు ఎకరాల్లో వస్తున్న ఈ హోటల్ ద్వారా నాలుగు వందలకు పైగా ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది. 2028చివరి నాటికి ఆపరేషన్స్ ప్రారంభం కానున్నాయి. రెండోవది నోవోటెల్.. ఇప్పటికే విజయవాడలో ఉన్న నోవాటెల్ కు తోడుగా లింగాయపాలెంలో రూ. 220 కోట్లతో 5-స్టార్ హోటల్ & కన్వెన్షన్ సెంటర్‌కు భూమిపూజ ఘనంగా జరిగింది. నాలుగు ఎకరాల్లో నిర్మాణం జరగనున్న ఈ ప్రాజెక్టు 2027 చివరి నాటికి పూర్తవుతుంది. అంతర్జాతీయ సదస్సులు, వ్యాపార సమావేశాలకు నోవాటెల్ హబ్‌గా మారనుంది. అలాగే మూడోది తాజ్ వివాంతా.. సెప్టెంబర్ 10న మందడం సీడ్ యాక్సెస్ రోడ్‌లో రూ.200 కోట్లతో 5-స్టార్ హోటల్ నిర్మాణం ప్రారంభమైంది. నాలుగు ఎకరాల్లో తాజ్ గ్రూప్ బ్రాండ్‌తో G.V. ఎస్‌టేట్స్ & హోటల్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఈ ప్రాజెక్టు చేపట్టింది. కన్వెన్షన్ సెంటర్ కోసం అదనంగా 2.5 ఎకరాలు కూడా కేటాయించారు. ఇది కూడా 2028 నాటికి రెడీ అవుతుందని సమాచారం. ఇవి కాకుండా.. మరికొన్ని స్టార్ హోటల్స్ కు ప్రభుత్వం భూములు కేటాయించగా.. నిర్మాణాలు ప్రారంభమవుతున్నాయి. మూడేళ్లు పూర్తయ్యే సరికి అంటే 2028చివరికల్లా ఇవన్నీ అందుబాటులోకి రానున్నాయి.












Comments are closed