తెలంగాణ: మున్సిపల్ ఎన్నికల వేళ జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో మంత్రులతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. ఈసందర్భంగా ఆయన కీలక సూచనలు చేశారు. మంత్రులందరూ జిల్లాలకు వెళ్లి పరిస్థితిని క్షుణ్నంగా పరిశీలించాలని, వెనుకబడిన మున్సిపాలిటీలపై ప్రత్యేకదృష్టి సారించాలని ఆదేశించారు.
మున్సిపల్ ఎన్నికల్లో టికెట్ ఆశించి భంగపడ్డ నేతలను బుజ్జగించి, పార్టీకి అనుకూలంగా పనిచేసేలా చూడాలని సూచించారు. పాత, కొత్త నేతలందరూ సమన్వయంతో ముందుకు సాగాలని తెలిపారు. ఎన్నికల్లో ఒక్కఓటు కూడా చీలకుండా జాగ్రత్త పడాలని స్పష్టంచేశారు.
ఈఎన్నికల్లో గెలుపు బాధ్యత పూర్తిగా పార్లమెంట్ నియోజకవర్గ ఇన్‌చార్జులదే అని సీఎం స్పష్టంగా పేర్కొన్నారు.











Comments are closed