Shopping cart

Subtotal $0.00

View cartCheckout

At Peoplespost News, we aim to give our readers clear and useful information. We focus on honest reporting and keeping you updated about important events around the world.

TnewsTnews
  • Home
  • Politics
  • నూతన సర్పంచ్‌లకు, ఉప సర్పంచ్‌లకు సీఎం రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు..!

నూతన సర్పంచ్‌లకు, ఉప సర్పంచ్‌లకు సీఎం రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు..!

cm Revanth reddy wishes

తెలంగాణలో ఎట్టకేలకు స్థానిక పాలన మొదలైంది. రాష్ట్రవాప్తంగా జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో గెలిచిన సర్పంచ్‌లు, ఉప సర్పంచ్‌లు, వార్డు మెంబర్లు పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఈ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా కొలువుదీరిన స్థానిక పాలకవర్గానికి సీఎం రేవంత్ రెడ్డి ఎక్స్ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. మంచి పాలన అందించి, పంచాయతీలను ఆదర్శవంతమైన గ్రామాలుగా తీర్చిదిద్దుతారని.. మీరంతా ప్రజల మన్ననలు పొందాలని సీఎం ఆకాంక్షించారు.


కాగా తెలంగాణలో మూడు దశల్లో జరిగిన పంచాయతీ ఎన్నికలల్లో అధికార కాంగ్రెస్ పార్టీ మొత్తం 6821 స్థానాలు గెలిచి తన ఆధిపత్యాన్ని చాటగా…ప్రతిపక్ష బీఆర్ఎస్ 3520 స్థానాల్లో, బీజేపీ 703 స్థానాలకు పరిమితం అయ్యాయి..కాంగ్రెస్ పార్టీ రెబల్స్, ఇండిపెండెంటలు 1654 స్థానాల్లో విజయం సాధించారు..కాగా వీరిలో 80 శాతం మంది సర్పంచ్‌లు అభివృద్ధి కోసం అధికార కాంగ్రెస్ పార్టీలో చేరడం ఖాయమైంది. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఘన విజయం సాధించడంతో ఇదే ఊపులో వరుసగా ఎంపీటీసీలు, జెడ్పీటీసీ ఎన్నికలు, ఆతర్వాత మున్సిపల్, కార్పొరేషన్ల ఎన్నికలను కూడా నిర్వహించేందుకు కాంగ్రెస్ సర్కార్ సిద్ధమవుతోంది.

Comments are closed

Related Posts