Shopping cart

Subtotal $0.00

View cartCheckout

At Peoplespost News, we aim to give our readers clear and useful information. We focus on honest reporting and keeping you updated about important events around the world.

TnewsTnews
  • Home
  • Movie
  • Adventure
  • వోక్సెన్ యూనివర్సిటీ విద్యార్ధులతో ఫ్రెండ్లీ మ్యాచ్ ఆడిన సీఎం రేవంత్

వోక్సెన్ యూనివర్సిటీ విద్యార్ధులతో ఫ్రెండ్లీ మ్యాచ్ ఆడిన సీఎం రేవంత్

సంగారెడ్డి జిల్లా సదాశివపేట కంకోల్‌లోని వోక్సెన్ యూనివర్సిటీని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ సందర్శించారు. పర్యటనలో మంత్రి దామోదర రాజనర్సింహతో కలిసి యూనివర్సిటీలో విద్యార్థులు ఏర్పాటు చేసిన విభిన్న విభాగాల ఎగ్జిబిషన్ స్టాళ్లను సీఎం పరిశీలించారు. విద్యార్థుల నైపుణ్యం, ఇన్నోవేషన్ పట్ల సీఎం ప్రశంసలు కురిపించారు. పర్యటనలో భాగంగా వోక్సెన్ స్పోర్ట్స్ అకాడమీని కూడా ముఖ్యమంత్రి పరిశీలించారు. అక్కడి అత్యాధునిక క్రీడా సదుపాయాలపై సంతృప్తి వ్యక్తం చేసిన ఆయన, విద్యార్థుల్లో క్రీడా స్ఫూర్తిని పెంపొందించేందుకు తీసుకుంటున్న చర్యలను అభినందించారు. ఈ సందర్భంగా వోక్సెన్ వ్యవస్థాపకులు, చాన్సలర్ ప్రవీణ్ కె.పూల ముఖ్యమంత్రికి యూనివర్సిటీ పురోగతి, పరిశోధనా కార్యక్రమాలు, భవిష్యత్ ప్రణాళికలను వివరించారు. పలువురు అధ్యాపకులు, సిబ్బంది కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం యూనివర్సిటీ ఫుట్‌బాల్ స్టేడియంకు చేరుకుని విద్యార్థులతో కలిసి సీఎం ఫుట్‌బాల్ ఆడారు. ప్రాక్టీస్ మ్యాచ్‌లో పాల్గొన్న రేవంత్ రెడ్డి విద్యార్థులతో హుషారుగా గడిపి, స్పోర్ట్స్ గ్రౌండ్‌ను సందడితో నింపారు. సీఎంఈ పర్యటనతో వోక్సెన్ యూనివర్సిటీ క్యాంపస్ ఉత్సాహభరితంగా మారగా, విద్యార్థులు, అధ్యాపకులు ముఖ్యమంత్రి సందర్శనపై సంతోషం వ్యక్తం చేశారు.

Comments are closed

Related Posts