Shopping cart

Subtotal $0.00

View cartCheckout

At Peoplespost News, we aim to give our readers clear and useful information. We focus on honest reporting and keeping you updated about important events around the world.

TnewsTnews
  • Home
  • Telangana
  • నాడు ఆత్మాభిమానంతో కొట్లాడి.. నేడు అంతర్జాతీయ స్థాయిలో తెలంగాణను నిలిపిన సీఎం రేవంత్ రెడ్డి..!

నాడు ఆత్మాభిమానంతో కొట్లాడి.. నేడు అంతర్జాతీయ స్థాయిలో తెలంగాణను నిలిపిన సీఎం రేవంత్ రెడ్డి..!

“ఎనుముల రేవంత్ రెడ్డి అనే నేను” అంటూ తెలంగాణ ప్రజల గుండెలపై చేసిన సంక్షేమ సంతకానికి రెండేళ్లు పూర్తయ్యాయి.. పదేళ్ల బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం తర్వాత 2023, డిసెంబర్‌ 7న కాంగ్రెస్‌ అధికారాన్ని దక్కించుకోగా ముఖ్యమంత్రిగా రేవంత్‌ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసారు. గత ఎన్నికలకు ముందు పీసీసీ అధ్యక్షుడి హోదాలో రేవంత్‌ రెడ్డి ఇచ్చిన హామీలు, అభయహస్తం మేనిఫెస్టోలో హామీలు, ప్రధానంగా ఆరు గ్యారంటీలే ప్రజలను కాంగ్రెస్ కు దగ్గరచేసాయి.. అందుకే కాంగ్రెస్ గెలిచిందనడంలోనూ సందేహం లేదు.. అలా గొప్ప కలలు కనడానికి ధైర్యం కావాలి.. గొప్ప కార్యాలు చేయడానికి సంకల్పం కావాలి.. అలాంటి ధైర్య సంకల్పాన్ని రేవంత్ రెడ్డిలో ప్రజలు చూసారు కాబట్టే తమఓటుతో విజయాన్ని అందించారు. అలా నిండు మనస్సుతో ఆశీర్వదించిన నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలకు ధన్యవాదాలు చెప్తూనే రేవంత్ రెడ్డి పాలన కొనసాగుతోంది.

అందుకే దేశంలోని అన్ని రాజకీయ పార్టీలు ఫిరాయింపులతో భయపడుతున్నా.. ఏమాత్రం తన పాలనపై సంకోచించకుండా ప్రజాశ్రేయస్సే పరమావధిగా సాగుతున్న రేవంత్ సర్కార్ కు ఫిరాయింపు అనే పదమే వినపడలేదు.. మరోవైపు బైఎలక్షన్ లోనూ ప్రతిపక్షానికి అవకాశమివ్వకుండా విజయవంతంగా తన అభ్యర్ధులను గెలిపించుకున్నారు. ముఖ్యమంత్రి హోదాలో బహిరంగ సభలకు హాజరైన ప్రతిసారీ.. గత కేసీఆర్ పాలనకు, తన పాలనలోని తారతమ్యాలను ప్రజలకు వివరిస్తున్నారు.. కేసీఆర్‌ హయాంలో పేదలకు దొడ్డుబియ్యం ఇచ్చారని, కానీ దేశంలోని ఏ రాష్ట్రంలో లేనివిధంగా తెలంగాణలో సన్నబియ్యం సన్నబియ్యం సరఫరా చేస్తున్నామని, పేదల ఆకలి తీర్చడమే కాంగ్రెస్‌ ప్రభుత్వ లక్ష్యమని రేవంత్ చెప్తున్నారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం పేదలకు డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు ఇస్తామని మాటఇచ్చి మోసం చేసారని కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక తెలంగాణలో 4లక్షలకు పైగా ఇళ్లు నిర్మిస్తున్నామని చెప్తున్నారు. కాంగ్రెస్‌ పాలనలో పేదలకు న్యాయం జరుగుతుందని ప్రజలకు వివరిస్తున్నారు.. కాంగ్రెస్‌ గెలిస్తే కరెంట్‌ ఉండదంటూ గతంలో చేసిన ప్రచారం పూర్తి అవాస్తవమని ప్రజలే తెలుసుకున్నారు. 24గంటలపాటు ఉచిత విద్యుత్ ఇచ్చిన ఘనత తమదేనంటూ సగర్వంగా చెప్పుకుంటున్నారు రేవంత్.. ఆరు గ్యారెంటీల్లో మొదటగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని విజయవంతంగా అమలు చేస్తున్నారు. గృహజ్యోతి పేరుతో 200యూనిట్ల వరకూ ఉచిత విద్యుత్ అందిస్తున్నారు. రైతు భరోసా పేరుతో రైతులు, కౌలు రైతులకు రూ.15వేలు ఆర్థికసాయం, వ్యవసాయ కూలీలకు రూ.12వేలు ఇచ్చే ప్రక్రియ ప్రారంభమైంది. మూసీ సుందరీకరణ ప్రాజెక్టు, రైతురుణమాఫీ అమలు చేసారు.

మహాత్మా జ్యోతిరావు ఫూలే భవన్‌

గతంలో కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ప్రగతి భవన్ ముందు కంచె ఉండేది. రేవంత్ రెడ్డి సీఎం అయిన వెంటనే ఆ కంచెను తొలగించి ప్రగతి భవన్ పేరును మహాత్మా జ్యోతిరావు ఫూలే భవన్‌గా మార్చి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు కేటాయించారు. ప్రజావాణి ద్వారా ప్రజల నుంచి వినతులు స్వీకరించి వాటి పరిష్కారానికి శ్రీకారం చుట్టింది రేవంత్ సర్కార్.. వాస్తవానికి గత ప్రభుత్వ హయాంలో మంత్రులు, ఎమ్మెల్యేలను కూడా కేసీఆర్‌ కలవలేదు. కేసీఆర్ ఉన్న ప్రగతి భవన్‌ లేదా ఫామ్‌హౌస్ లోకి కుటుంబ సభ్యులు మినహా ఎవ్వరినీ రానివ్వలేదు. అలాంటి పరిస్థితులను మార్చి ప్రజాప్రతినిధులను, ప్రజలను నేరుగా కలుస్తూ ఇచ్చిన హామీలను అమలు చేస్తూ.. మరిన్ని హామీలను నెరవేర్చేందుకు ప్రయత్నం చేస్తూ అంతర్జాతీయ స్థాయిలో తెలంగాణ ప్రతిష్టను మరింత పెంచేలా సీఎం రేవంత్ రెడ్డి అడుగులు వేస్తున్నారు..

Comments are closed

Related Posts