Cockfights : మీర్జాపురంలో మినీ క్యాసినో.. భారీఎత్తున పందేలు..
సంక్రాంతి సందర్భంగా కోడిపందాల బరులు సిద్ధమయ్యాయి. హైకోర్టు ఆదేశాలు భేఖాతర్ చేస్తూ పందెం రాయుళ్లు, నిర్వాహకులు సిద్ధమవుతున్నారు. ఎక్కడా పందేలను అడ్డుకోవడం లేదు… ఓన్లీ ఆడుకోనియడమే.. చర్యలు ఉన్నా తూతూమంత్రంగానే.. అధికార పార్టీ నేతలే బరికి ఇంతని వసూళ్లు చేస్తున్నారంటూ ఆరోపణలు వినిపిస్తున్నాయి..
మిర్జాపురంలో మినీ క్యాసినోకి రంగం సిద్దం చేసారని ప్రచారం జరుగుతోంది. ఉప్పులూరు, తాడేపల్లి, గన్నవరం, విజయవాడ, కైకలూరు నియోజకవర్గాల్లో బరితెగింపు పోటాపోటీలు నిర్వహిస్తున్నారు.
ఏలూరు జిల్లాలో ఓ బరిలోకి 16మంది ఎమ్మెల్యేలు, ముగ్గురు మంత్రులు పాల్లొంటారంటూ సమాచారం. సంప్రదాయ ముసుగులో కోట్లాది రూపాయలు పందాలకు రడీ..
మిర్జాపురం బరికి 4 కోట్లు ఖర్చుతో రడీ చేశారని వినికిడి. మా బరికి రండి అన్ని సదుపాయాలు ఉన్నాయంటూ.. భారీ ఎత్తున ప్రకటనలు, సోషల్ మీడియాలో ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు.
ఇంత బహిరంగంగా పందేలపై ప్రచారం చేస్తున్నా.. పోలీసులు కన్నెత్తి చూడని పరిస్థితి కనిపిస్తుంది..
విజయవాడ నడిబొడ్డులో స్థానిక ప్రజాప్రతినిధుల కనుసైగల్లోనే భారీ బరులు సిద్ధమవుతున్నాయి..
భీమవరం, నరసాపురం, ఐ. భీమవరాల్లో హైటెన్షన్ నెలకొంది.
తెలంగాణా నుంచి ఇప్పటికే ఆయా హోటళ్లలో పందెం రాయుళ్లు దిగిపోతున్నారు..
భీమవరంలో రోజుకు హోటల్ రూం రెంట్ 15వేలు పలుకుతోంది. ఆకివీడు, కైకలూరులోని చిన్న చిన్న హోటళ్లు కూడా వేలల్లో పలుకుతున్నాయంటే పరిస్థితి అర్ధం చేసుకోవచ్చు.













Comments are closed