న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ నియంత్రణ, ప్రజల భద్రతపై పోలీసు శాఖ కఠిన చర్యలకు సిద్ధమైంది. నగర పోలీస్ కమిషనర్ సజ్జనార్ మందుబాబులకు తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. మద్యం సేవించి వాహనాలు నడిపితే ఎలాంటి ఉపేక్ష ఉండదని స్పష్టం చేశారు. నగరవ్యాప్తంగా 120 ప్రాంతాల్లో ప్రత్యేక డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
మద్యం తాగి పట్టుబడితే
భారీ జరిమానా
వాహనాల జప్తు
జైలు శిక్ష
డ్రైవింగ్ లైసెన్స్ రద్దు
తప్పనిసరిగా అమలు చేస్తామని హెచ్చరించారు.
అలాగే ర్యాష్ డ్రైవింగ్, బహిరంగ ప్రదేశాల్లో న్యూసెన్స్ సృష్టించిన వారిపై కూడా కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. నూతన సంవత్సర వేడుకలను శాంతియుతంగా, బాధ్యతతో జరుపుకోవాలని సీపీ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.














Comments are closed