రాజకీయ కక్షతోనే నేషనల్ హెరాల్డ్ కేసు పేరుతో ఏఐసీసీ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీని ను పది సంవత్సరాల నుండి వేధించారని గద్వాల జిల్లా డీసీసీ అధ్యక్షుడు రాజీవ్ రెడ్డి ఆరోపించారు. సీఎం రేవంత్ రెడ్డి టిపిసిసి అధ్యక్షుడు మహేష్ గౌడ్ పిలుపు మేరకు కోర్టు హెరాల్డ్ కొట్టివేయడంతోనందుకు బీజేపీ కేంద్ర ప్రభుత్వ వైఖరి నిరసిస్తూ రాజీవ్ రెడ్డి ఆధ్వర్యంలో గద్వాల జిల్లా కేంద్రంలోని పాత బస్టాండ్ వైయస్సార్ చౌరస్తాలో నిరసన కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా రాజీవ్ రెడ్డి మాట్లాడుతూ .. నేషనల్ హెరాల్డ్ ప్రాచీన పత్రికను అభివృద్ధి పరిచే క్రమంలో జరిగిన లావాదేవీలను తప్పుగా వక్రీకరిస్తూ బీజేపీ ప్రభుత్వం సిబిఐను ఉపయోగించి తప్పుడు కేసులను వేసిందని, పది సంవత్సరాల నుండి సోనియా గాంధీ గారి కుటుంబాన్ని ఇబ్బందులకు గురిచేసారని. గాంధీ కుటుంబాన్ని ముప్ తిప్పలు పెట్టారు కానీ నిజాన్ని ఎవరూ దాచలేరన్నారు. అందుకే సుప్రీంకోర్టు నిరాధార ఆరోపణలతో కూడిన ఈ క్రిమినల్ కేసును కొట్టివేసిందన్నారు. ప్రతిపక్షాను ముప్పుతిప్పలు పెట్టి, దేశ ప్రజల సమస్యలను ప్రక్కదారి పట్టించడం కోసం చేసిన కేసును నిర్దారించడం జరిగిందన్నారు.
ప్రధాని మోడీ గారు పేద ప్రజల ఖాతాలలో రూ.15లక్షల డబ్బు జమ చేస్తానని ప్రజలను నమ్మించి నల్లధనాన్ని దోచుకోవడం జరిగిందన్నారు. ఇప్పటివరకూ ఒక్కరి ఖాతాల్లో కూడా ఒక్క రూపాయి కూడా జమ చేయలేదన్నారు. కార్పొరేట్ సంస్థలకు కోట్లరుపాయల రుణాలను మాఫీచేసి లక్షలకోట్ల ప్రజాధనాన్ని ఆధాని అంబానీలకు దోచి పెట్టిన ఘనులు బీజేపీ నాయకులు అని రాజీవ్ రెడ్డి విమర్శించారు.
ప్రభుత్వ సంస్థలను కాంగ్రెస్ ప్రభుత్వం స్థాపించి ప్రతి సౌకర్యాన్ని భారత పౌరులకు చేకూరిస్తే బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఇద్దరు అమ్మేవారు ఇద్దరు కొనేవారని ప్రతి ప్రభుత్వ సంస్థను నిరుగారుస్తూ నష్టాలు చూపెడుతూ తక్కువ ధరలకే ప్రభుత్వ సంస్థలను, ఆస్తులను తక్కువకు ధరలకు అమ్ముకున్నారే తప్ప బాగు చేయలేదన్నారు. మోదీ ప్రభుత్వం నిత్యావసరాల రేట్లు పెంచి సామాన్యులు ఇబ్బందులకు గురి చేస్తోందన్నారు.











Comments are closed