దేశ రాజధాని ఢిల్లీ మహానగరం తీవ్ర వాయు కాలుష్యంతో అల్లాడుతోంది. సోమవారం ఉదయం గాలి నాణ్యత సూచిక (AQI) 450 మార్ను దాటింది. అశోక్ విహార్లో ఏక్యూఐ 500గా, ఆనంద్ విహార్, అక్షర్ ధామ్ ప్రాంతాల్లో 493గా నమోదైంది. ద్వారకాలో 469, నోయిడాలో 454గా ఉంది. రాత్రి ఉష్ణోగ్రతలు 8.2 డిగ్రీలకు పడిపోవడంతో భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. దట్టమైన పొగమంచు కారణంగా దృశ్యమానత తగ్గి, విమాన, రైలు ప్రయాణాలపై తీవ్ర ప్రభావం పడింది.
ఇప్పటికే ఢిల్లీ ఎయిర్పోర్ట్ ప్రయాణికులకు అడ్వైజరీ జారీ చేసింది. ఢిల్లీని దట్టమైన పొగమంచు కప్పేయడంతో విమానాల ల్యాండింగ్ కు సమస్యలు తలెత్తుతున్నాయి. గాలి నాణ్యత ప్రమాదకర స్థాయికి పడిపోవడంతో ప్రజలు శ్వాసకోశ సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. కళ్ల మంటలు, గొంతునొప్పితో ఇబ్బంది పడుతున్నారు. వాహనాల రద్దీ పెరిగిపోవడం, నిర్మాణ, పారిశ్రామిక వ్యర్థాలతో అధికారులు GRAP-IV వంటి చర్యలను అధికారులు అమలు చేసారు. ప్రజలు బయట తిరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.









Comments are closed