తెలంగాణలో గత రెండేళ్లలో 588 మంది మావోయిస్టులు లొంగిపోయి జనజీవన స్రవంతిలో కలిశారని డీజీపీ శివధర్ రెడ్డి వెల్లడించారు. రాష్ట్రానికి చెందిన మరో 15 మంది అజ్ఞాత కేడర్ కూడా తక్షణమే ఆయుధాలు వీడాలని ఆయన పిలుపునిచ్చారు. లొంగిపోయిన వారికి ప్రభుత్వం తరపున తక్షణ ఆర్థిక సాయం, పక్కా పునరావాసం కల్పిస్తామని, స్వేచ్ఛగా, గౌరవంగా జీవించేలా భరోసా ఇస్తామని డీజీపీ స్పష్టం చేశారు. డీజీపీ ప్రకటనతో మరోసారి మావోలపై కేంద్రం విరుచుకుపడనుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.















Comments are closed