ప్రముఖ ప్రకృతి వైద్య రంగ నిపుణులు డా. మంతెన సత్యనారాయణ రాజును ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ప్రకృతి వైద్య సలహాదారుగా (Advisor – Naturopathy) నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రకృతి వైద్య విధానాలను ప్రజలకు మరింత చేరువ చేయడం, ఆరోగ్య జీవన విధానాలపై అవగాహన పెంపొందించడం, ప్రభుత్వ ఆరోగ్య కార్యక్రమాలకు మార్గదర్శనం చేయడం లక్ష్యంగా ఈ నియామకం చేపట్టినట్లు అధికారులు తెలిపారు.
డా. మంతెన సత్యనారాయణ రాజుకు ప్రకృతి వైద్య రంగంలో ఉన్న విశాల అనుభవం, పరిశోధన, ప్రజారోగ్యంపై ఆయన చేసిన సేవలు ఈ నియామకానికి కారణమయ్యాయని ప్రభుత్వం పేర్కొంది. రాష్ట్రంలో ప్రకృతి వైద్యాన్ని మరింత విస్తృతంగా అమలు చేయడంలో ఆయన కీలక పాత్ర పోషిస్తారని ఆశాభావం వ్యక్తం చేసింది.
ఈ నియామకంతో ఏపీ రాష్ట్రంలో ఆరోగ్యకర జీవన విధానాలు, సహజ వైద్య పద్ధతులకు మరింత ప్రాధాన్యం లభించనుందని అభిప్రాయం వ్యక్తమవుతోంది.















Comments are closed