తెలుగురాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్, దివ్వెల మాధురి జంట మరోసారి వివాదాస్పద వార్తల్లోకి ఎక్కారు. మాధురి పుట్టినరోజు సందర్భంగా గురువారం రాత్రి హైదరాబాద్ నగరశివారు మొయినాబాద్ ఫామ్‌హౌస్‌లో నిర్వహించిన పార్టీపై పోలీసులు దాడి చేసారు.
అనుమతి లేకుండా మద్యం, హుక్కాతో పార్టీ చేసుకుంటున్నారనే సమాచారంతో ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. ఈ తనిఖీల్లో వీరిద్దరూ పోలీసుల అదుపులోకి వెళ్లినట్లు సమాచారం. తెలుగు రాష్ట్రాల్లో దువ్వాడ, మాధురి జంట గురించి తెలియని వారుండరు. సోషల్ మీడియాలో ఈ జంట మరింత ఫేమస్..
తాజాగా మాధురి బిగ్‌బాస్ షోలో పాల్గొని, తన పాపులారిటీని మరింత పెంచుకుంది. ఈ ముదురు లవ్‌బర్డ్స్ నిత్యం ఏదో వార్తల్లో ఉంటూనే ఉంటారు. అయితే జాగా దువ్వాడ శ్రీనివాస్ , మాధురిలు వివాదాన్ని మాత్రం వారు కవర్ చేసుకుంటున్నారు.
కేవలం సన్నిహితుడి బర్త్ డే పార్టీ కోసం మాత్రమే వెళ్లినట్టు చెబుతున్నారు. సదరు వ్యక్తి మొయినాబాద్‌లోని ది పెండెంట్ ఫామ్‌హౌస్‌లో పార్టీ నిర్వహించాడని, అనుమతి లేకుండా మద్యం తీసుకుంటున్నారనే సమాచారం తమకు తెలియదని, ఎస్ఓటీ పోలీసులకు దువ్వాడ శ్రీనివాస్, దివ్వెల మాధురి చెబుతున్నారు.
ఏపీలోని అమలాపురంకి చెందిన పార్థసారథి అనే వ్యక్తి హైదరాబాద్‌లో ఉంటూ ప్రైవేటు ఉద్యోగం చేస్తున్నాడు. ఈ క్రమంలో అతడి పుట్టిన రోజు సందర్భంగా గురువారం మొయినబాద్ మండలంలోని పెండెంట్ ఫార్మ్ హౌస్‌లో పార్టీ నిర్వహించాడు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్సీ శ్రీనివాస్, మాధురిలను ఆహ్వానించినట్టు చెబుతున్నారు.









Comments are closed