చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో విషాద ఘటన చోటుచేసుకుంది. అప్పుల భారాన్ని తట్టుకోలేక ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. కుటుంబ సభ్యులు ఎలుకల మందు తాగి ఆత్మహత్యకు యత్నించారు.
ఈ విషయం తెలుసుకున్న స్థానికులు వెంటనే స్పందించి బాధితులను సమీప ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం నలుగురికీ చికిత్స అందుతుండగా, వారి ఆరోగ్య పరిస్థితిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. అప్పుల ఒత్తిడి, ఆర్థిక ఇబ్బందులే ఈ దారుణ నిర్ణయానికి కారణమని ప్రాథమికంగా తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.











Comments are closed