Shopping cart

Subtotal $0.00

View cartCheckout

At Peoplespost News, we aim to give our readers clear and useful information. We focus on honest reporting and keeping you updated about important events around the world.

TnewsTnews
  • Home
  • Andhra Pradesh
  • జగన్ ఇంటిముందు కేసీఆర్- కేటీఆర్ ఫ్లెక్సీలు..

జగన్ ఇంటిముందు కేసీఆర్- కేటీఆర్ ఫ్లెక్సీలు..

ఏపీ ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి గురించి ఆయన అభిమానులు ఎప్పుడు ఒకటే చెబుతూ ఉంటారు.. ఒంటరిగా వచ్చాడు.. ఒంటరిగా పోటీ చేస్తున్నాడు.. జగన్ ఇతర పార్టీనుండి ఎలాంటి అండ లేదు అని ప్రచారం చేస్తూ ఉంటారు..

అందుకు తగ్గట్టుగానే చాలా సందర్భాల్లో జగన్ ఒంటరిగా బరిలోకి దిగారు.. అయితే గతంలో ఒకసారి మాత్రం జగన్ పోటీ చేసినప్పుడు తెలంగాణలో వామపక్షాలతో కలిసి బరిలోకి దిగిన సందర్భం ఉంది.. అది కాకుండా కేంద్రంలో అటు యూపీఏ ప్రభుత్వంతో గాని ఇటు ఎన్డీయే ప్రభుత్వంతో గాని జగన్ కలిసి అడుగులు వేసిన దాఖలాలు లేవు

అయితే జగన్ లాంటి ఆర్థిక నేరస్థుడు, ఉన్మాదితో ఎవరూ రాజకీయంగా పొత్తులు పెట్టుకోవడానికి ముందుకు రారని, జగన్ ఒంటరి అంటూ టీడీపీ జగన్ అండ్ కోకు కౌంటర్ ఇస్తూనే ఉంటుంది..

పొత్తుల విషయం పక్కన పెడితే పక్క రాష్ట్రం తెలంగాణలో మాత్రం జగన్ బీఆర్ఎస్ పార్టీ అధినేత కెసిఆర్ తో సన్నిహిత సంబంధాలు కలిగి ఉంటారు.. జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత హైదరాబాద్ వచ్చి కేసీఆర్ ను మర్యాదపూర్వకంగా కలిసి వెళ్లారు. అలాగే జగన్ ప్రమాణ స్వీకారానికి కేసీఆర్ హాజరయ్యారు.. కేసిఆర్ కూడా తిరుపతి పర్యటనలో వైసిపి నాయకురాలు రోజా ఇంటికి వెళ్లి మరి భోజనం చేసి వచ్చారు.. అలా ఆ ఇరు పార్టీలు ఎప్పటికప్పుడు తమ స్నేహ సంబంధాన్ని చాటుకుంటూనే ఉన్నాయి

ఇక కేసీఆర్ పై గెలిచి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత జగన్ కనీసం పక్క రాష్ట్ర ముఖ్యమంత్రిగా కూడా భావించి, సాటి ముఖ్యమంత్రి హోదాలో రేవంత్ రెడ్డికి శుభాకాంక్షలు చెప్పలేదు. గతంలో రేవంత్ రెడ్డికి జగన్ కు మధ్య ఉన్న రాజకీయ వైరుధ్యాన్ని జగన్ వ్యక్తిగతంగా భావించారు కాబట్టే జగన్ రేవంత్ రెడ్కిడి శుభాకాంక్షలు చెప్పలేదని అందరూ భావించారు.

తాజాగా జగన్ పుట్టినరోజు సందర్భంగా తాడేపల్లి నివాసం వద్ద ఏర్పాటుచేసిన ఓ ఫ్లెక్సీ ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.. జగన్, కేసీఆర్, కేటీఆర్ కలిపి ఉన్న ఫొటోలో జగన్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతూ కొంతమంది అభిమానులు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు..

ఆఫ్లెక్సీలు చూస్తున్న వారంతా రేవంత్ రెడ్డి చంద్రబాబు సన్నిహితులని వారిద్దరికీ రాజకీయ శత్రువులైన కేటీఆర్ కెసిఆర్ జగన్ మిత్రువులని అంటున్నారు. శత్రువు శత్రువు మిత్రువే అన్న స్లొగన్స్ సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి.

Comments are closed

Related Posts