Shopping cart

Subtotal $0.00

View cartCheckout

At Peoplespost News, we aim to give our readers clear and useful information. We focus on honest reporting and keeping you updated about important events around the world.

TnewsTnews
  • Home
  • Business
  • ఫార్ములా-ఈ కార్ రేస్ కేసులో ఛార్జ్‌షీట్‌కు రంగం సిద్ధం!

ఫార్ములా-ఈ కార్ రేస్ కేసులో ఛార్జ్‌షీట్‌కు రంగం సిద్ధం!

Hyderabad: ఫార్ములా-ఈ కార్ రేసు (Formula E car Race case) కేసు కీలకమలుపు తిరిగింది. సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్‌ను ప్రాసిక్యూషన్ (Prosecution) చేసేందుకు కేంద్రప్రభుత్వం (Central Govt) నుంచి అధికారికంగా అనుమతి లభించింది.

ప్రాసిక్యూషన్‌ విషయంపై రాష్ట్రానికి కేంద్రం సమాచారం ఇచ్చింది. ఫార్ములా-ఈ రేసింగ్ ఒప్పందాల్లో నిబంధనల ఉల్లంఘన జరిగిందని తెలంగాణ అవినీతి నిరోధక శాఖ (ACB) గతంలోనే కేసునమోదు చేసిన సంగతి తెలిసిందే.

ఫార్ములా-ఈ కార్ రేస్ కేసులో మాజీమంత్రి కేటీఆర్‌ (KTR) ను విచారించడానికి తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్వర్మ అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే. తాజాగా అరవింద్ కుమార్ విషయంలో కేంద్రం అనుమతి ఇవ్వడంతో ఇప్పుడు ఏసీబీ ఆయనపై కోర్టులో ఛార్జ్‌షీట్ దాఖలు చేసేందుకు పూర్తి స్వేచ్ఛ పొందింది. కాగా, ఈ కేసులో ఏ1గా మాజీ మంత్రి కేటీఆర్‌, ఏ2గా ఐఏఎస్ అధికారి అరవింద్‌ ఉన్నారు.

Comments are closed

Related Posts