ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం బిలాస్‌పుర్‌లో దారుణమైన ఘటన చోటుచేసుకుంది. తనఫోన్ నంబర్ బ్లాక్ చేశాడన్న కోపంతో ఓ యువతి తన ప్రియుడిని కత్తితో పొడిచి హత్య చేసింది. ఈఘటన బిలాస్‌పుర్ సివిల్ లైన్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది.
ప్రసాద్ సూర్యవంశీ (25) అనే యువకుడు శుభమ్ విహార్ టీచర్స్ కాలనీలో అద్దెకు నివాసం ఉంటూ హోటల్లో పని చేస్తున్నాడు. గత కొంతకాలంగా ఓయువతితో ప్రేమ వ్యవహారం కొనసాగుతోంది. సోషల్ మీడియా ద్వారా వీరిద్దరికీ పరిచయం ఏర్పడినట్లు పోలీసులు తెలిపారు.
ఇటీవల ఇద్దరిమధ్య విభేదాలు తలెత్తడంతో యువకుడు యువతి ఫోన్ నంబర్‌ను బ్లాక్ చేశాడు. దీనిపై తీవ్ర ఆగ్రహానికి గురైన యువతి అతడిని కలిసేందుకు వెళ్లి వాగ్వాదానికిదిగింది. ఈక్రమంలో కత్తితో దాడి చేయడంతో ప్రసాద్ అక్కడికక్కడే మృతిచెందినట్లు పోలీసులు వెల్లడించారు.
పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టారు. నిందిత యువతిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలిపారు.















Comments are closed