తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో సిరిసిల్ల మున్సిపాలిటీ పరిధిలో అందరూ విస్తుపోయే ఘటన చోటు చేసుకుంది. రాష్ట్రంలోని ఏడు కార్పొరేషన్లు, 116 మున్సిపాలిటీలలో నిన్ననే పోలింగ్ ముగిసింది. చెదురుమదురు ఘటనలు మినహా రాష్ట్రంలో ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. ఈ ఎన్నికల సమయంలో చాలామంది అభ్యర్థులు అనధికారికంగా ఓటర్లకు నగదు, బహుమతులు పంచారు. అలా సిరిసిల్ల మున్సిపాలిటీలో ఒక అభ్యర్థి ఇచ్చిన కానుక చర్చనీయాంశంగా మారింది. తమకు గోల్డ్ కాయిన్ అని చెప్పి నకిలీ కానుక ఇచ్చారంటూ సిరిసిల్లలోని ఓ వార్డులో ఓటర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆ అభ్యర్థి ఓట్లు వేయించుకోవడానికి రాగి నాణేలకు పసిడిపూత పూసి బంగారు నాణేలుగా చెప్పి తమకు ఇచ్చారని పలువురు వాపోతున్నారు. ఈ ఘటన నేపథ్యంలో ఎన్నికల నిబంధనల ఉల్లంఘనపై అధికారులు విచారణ చేపట్టారు.















Comments are closed