అంతర్జాతీయ మార్కెట్లలో చోటుచేసుకున్న కీలక పరిణామాలతో బంగారం, వెండి ధరలు ఒక్కసారిగా పడిపోయాయి. ఒక్క రోజులోనే బంగారం ధరలో దాదాపుగా 10శాతం తగ్గుదల నమోదుకావడం దేశీయ మార్కెట్ పైనా తీవ్ర ప్రభావం చూపుతోంది. దాంతో తులం బంగారం ఒక్కరోజే రూ.19,750 కొంతమేర తగ్గింది. ప్రస్తుతం 24 క్యారెట్ల 10గ్రా. బంగారం ధర రూ.1,49,653గా కొనసాగుతోంది. ఇటీవల రోజులుగా స్థిరంగా ఉన్న బంగారం ధరలు ఒక్కసారిగా భారీగా పడిపోవడం పెట్టుబడిదారులను ఆందోళనకు గురిచేస్తోంది.
అదేవిధంగా వెండిధరల్లో కూడా తీవ్ర పతనం నమోదైంది. ఒక్కరోజే కిలో వెండిధర రూ.1,07,971 వరకు తగ్గింది. ప్రస్తుతం దేశీయ మార్కెట్‌లో కిలో వెండి ధర రూ.2,91,922గా ఉంది. అంతర్జాతీయ మార్కెట్‌లో వెండి ధరలు సుమారు 34శాతం వరకు పడిపోవడం తగ్గుదలకు ప్రధాన కారణంగా విశ్లేషకులు చెబుతున్నారు. డాలర్ బలపడటం, అంతర్జాతీయ ఆర్థిక పరిస్థితులు, పెట్టుబడిదారుల లాభాల స్వీకరణ వంటి అంశాలు బంగారం, వెండి ధరల పతనానికి కారణాలుగా భావిస్తున్నారు. రానున్నరోజుల్లో అంతర్జాతీయ మార్కెట్ పరిస్థితుల ఆధారంగా ధరల్లో మరింత మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.










Comments are closed