Shopping cart

Subtotal $0.00

View cartCheckout

At Peoplespost News, we aim to give our readers clear and useful information. We focus on honest reporting and keeping you updated about important events around the world.

TnewsTnews
  • Home
  • Andhra Pradesh
  • హ్యాట్సాఫ్ గొట్టిపాటి రవి.. అద్దంకి విద్యార్ధులకు ఉచిత సైకిళ్లు..!

హ్యాట్సాఫ్ గొట్టిపాటి రవి.. అద్దంకి విద్యార్ధులకు ఉచిత సైకిళ్లు..!

నాయకుడంటే ప్రజల కష్టాలు తీర్చేవాడు.. నాయకుడంటే ఇచ్చిన వాగ్ధానాలను నిలబెట్టుకునేవాడు.. హామీలు నెరవేర్చడంలో వెనుకడుగు వేయని తత్వం కొందరికే ఉంటుంది.. ఎన్నికల్లో గెలిచిన తర్వాత ప్రభుత్వ పధకాలు అమలు చేయడం, అభివృద్ధి సంక్షేమాన్ని అమలు చేయడం ఒక ఎత్తైతే.. తాను సొంతంగా ఇచ్చిన హామీలను గుర్తుపెట్టుకోవడం మరో ఎత్తు. వాస్తవానికి ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇచ్చే సొంత హామీలను మెజార్టీ నేతలు విస్మరిస్తుంటారు.. కానీ కొందరు మాత్రం ప్రజలకిచ్చిన ప్రతీ హామీని త్రికరణ శుద్ధిగా అమలు చేస్తారు.. అలాంటి నాయకుడే రాష్ట్రమంత్రి, అద్దంకి నియోజకవర్గ ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్..

అద్దంకి ప్రజల విద్య, వైద్యం విషయంలో రాజీపడని గొట్టిపాటి రవికుమార్.. ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి అయిన వెంటనే నియోజకవకర్గంలోని విద్యార్ధుల సమస్యపై దృష్టి సారించారు. ప్రధానంగా దూరాబారంతో చదువులకు దూరమవుతున్న విద్యార్ధుల సమస్యలను తీర్చేందుకు ఎన్నికల ముందు ఇచ్చిన హామీకి శ్రీకారం చుట్టారు..

విడతల వారీగా వందలాదిమంది విద్యార్ధులకు స్వచ్ఛంద సంస్థల సహకారంతో ఉచితంగా సైకిళ్లు పంపిణీ చేస్తున్నారు. తాజాగా కొరిశపాడు మండలం, రావినూతల పర్యటనలో భాగంగా గ్రామంలోని జెడ్పీహెచ్ పాఠశాల విద్యార్థులకు సైకిళ్లను పంపిణీ చేసారు. ఇప్పటివరకూ సుమారుగా 6000మంది విద్యార్ధులకు సైకిళ్లను అందించారు గొట్టిపాటి..

విద్యార్ధినీ విద్యార్ధులు కాలినడకన కాకుండా, ఆటోలను ఆశ్రయించకుండా సొంతంగా స్నేహితులతో కలిసి ఆహ్లాదంగా సైకిళ్లపై స్కూలుకు వెళ్తున్నారు. గొట్టిపాటి రవికి థాంక్యూ చెప్తున్నారు.

Comments are closed

Related Posts