హైదరాబాద్ జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో మాజీ మంత్రి హరీష్ రావుపై కొనసాగుతున్న సిట్ విచారణ రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. సజ్జనార్ నేతృత్వంలోని ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఈ విచారణను చేపట్టింది. ఈ సందర్భంగా హరీష్ రావు తరఫు న్యాయవాది అడ్వకేట్ రామచందర్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు. టెలిఫోన్ ట్యాపింగ్ కేసుతో హరీష్ రావుకు ఎలాంటి సంబంధం లేదని ఆయన స్పష్టం చేశారు. గతంలో ఇదే అంశంపై నమోదు చేసిన కేసు పూర్తిగా తప్పుడు కేసు (ఫాల్స్ కేసు) అని కోర్టులు కూడా తేల్చాయని గుర్తు చేశారు.
ఇప్పటికీ కొనసాగుతున్న సిట్ విచారణలో కొత్తగా తేలేదేమీ లేదని, ఇది పూర్తిగా రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే సాగుతోందని అడ్వకేట్ రామచందర్ రావు వ్యాఖ్యానించారు. చట్టపరంగా హరీష్ రావు నిర్దోషి అని, విచారణ ముగిసిన తర్వాత ఇదే విషయం మరోసారి రుజువవుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో సిట్ విచారణ ఫలితాలపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొనగా, మరోవైపు ఇది చట్టపరంగా ఎటువంటి మలుపు తిరుగుతుందో చూడాల్సి ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.













Comments are closed