Shopping cart

Subtotal $0.00

View cartCheckout

At Peoplespost News, we aim to give our readers clear and useful information. We focus on honest reporting and keeping you updated about important events around the world.

TnewsTnews
  • Home
  • Telangana
  • Hyderabad
  • Harish rao Enquiry : హరీష్ రావుకు మళ్లీ నోటీసులు..!

Harish rao Enquiry : హరీష్ రావుకు మళ్లీ నోటీసులు..!

తన కుమారుడు విదేశాలకు వెళ్తున్నారని దిగబెట్టడానికి ఎయిర్ పోర్టుకు వెళ్లాలని హరీష్ రావు రిక్వెస్ట్ చేయడంతోనే పోలీసులు ఏడున్నర గంటల తరవాత ఆయన విచారణ ముగించారట.. లేకుంటే హరీష్ రావు విచారణ మరింత కొనసాగేదని తెలుస్తోంది. అయితే విచారణ మధ్యలో ఆయన వెళ్లిపోయారు కాబట్టి మరోసారి విచారణకు పిలుస్తామని పోలీసు వర్గాలు చెబుతున్నాయి. హరీష్ విచారణ ముగిసిన తరవాత సిట్ చీఫ్, హైదరాబాద్ సీపీ సజ్జనార్ చేసిన ప్రకటన అలాగే అనిపించింది. హరీష్ రావు విచారణ కొనసాగుతుందని ఆయన ప్రకటించారు.

అయితే విచారణ అనంతరం హరీష్ రావు మాట్లాడుతూ రాజకీయంగా కీలకవ్యాఖ్యలు చేశారు. కానీ ఫోన్ ట్యాపింగ్ కేసు నిందితులతో టచ్ లోకి వెళ్లడం, మాట్లాడటం చేయవద్దని సిట్ సూచించారు. హరీష్ రావు ప్రెస్మీట్ లో మాట్లాడిన పరిణామాలు సిట్ విచారణలో జరిగాయని తెలుస్తోంది. హరీష్ రావుతో పాటు ఈటల రాజేందర్ ఫోన్లు ట్యాప్ అయినట్లుగా ఆధారాలను సిట్ బృందం హరీష్ ముందు ఉంచి ప్రశ్నించిందని, ఓ టీవీ చానల్ అధినేతతో కలిసి ట్యాపింగులు చేయించారన్నదానికి ఆధారాలను ఆయన ముందుపెట్టి ప్రశ్నించారని తెలుస్తోంది.

అవన్నీ ఫేక్ వార్తలు అని, హరీష్ రావు వాదించి తప్పించుకునే ప్రయత్నం చేసినట్టు తెలుస్తోంది. ఈ నేపధ్యంలో మరోసారి హరీష్ రావుకు నోటీసులు జారీ చేసే అవకాశముంది. అలాగే సుప్రీంకోర్టు కొట్టివేసిన కేసులో హరీష్ రావును విచారణకు పిలిచారని, బీఆర్ఎస్ నేతలు ప్రచారం చేయడాన్ని సిట్ చీఫ్ సజ్జనార్ ఖండించారు. ఇది ఆకేసు కాదని స్పష్టం చేశారు. ప్రజా ప్రతినిధులు, వ్యాపారవేత్తల ఫోన్లను ట్యాప్ చేసిన కేసులోనే హరీష్ రావును విచారణ జరిపారమన్నారు. ఈకేసులో సుప్రీం ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వలేదని గుర్తుచేశారు. ఈ పరిణామాలతో హరీష్ విచారణ ఇంకా మిగిలే ఉందని క్లారిటీ వచ్చేసింది.

Comments are closed

Related Posts