Shopping cart

Subtotal $0.00

View cartCheckout

At Peoplespost News, we aim to give our readers clear and useful information. We focus on honest reporting and keeping you updated about important events around the world.

TnewsTnews
  • Home
  • Andhra Pradesh
  • భర్తను చంపి, పోర్న్ వీడియోలు చూస్తూ కూర్చున్న సైకో భార్య

భర్తను చంపి, పోర్న్ వీడియోలు చూస్తూ కూర్చున్న సైకో భార్య

గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలం చిలువూరులో రెండు రోజులు క్రితం అనుమాస్పద స్థితిలో లోకం శివనగరాజు అనే వ్యక్తి మృతిచెందారు.. ఈయనకు 2007లో లక్ష్మీ మాధురి అనే మహిళతో వివాహం జరిగింది.. ఇద్దరు పిల్లలతో కలిసి జీవనం సాగిస్తున్నారు.

విజయవాడలోని ఒక సినిమా థియేటర్లో టికెట్ కౌంటర్లో పనిచేస్తున్న క్రమంలో గోపి అనే వ్యక్తితో పరిచయం ఏర్పడి, అతనితో వివాహేతర సంబంధం పెట్టుకున్న లక్ష్మీ మాధురి భర్త చేస్తున్న ఉల్లిపాయల వ్యాపారం నచ్చక, అతన్ని హైదరాబాద్‌లో గోపి నిర్వహిస్తున్న కారు ట్రావెల్స్‌లో ఉద్యోగం చేసేందుకు పంపించింది.

కొన్ని రోజుల తర్వాత శివనగరాజు సొంత గ్రామానికి తిరిగి రావడంతో, అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడని ఎలాగైనా అతని అడ్డు తొలగించుకోవాలని నిర్ణయించుకున్న లక్ష్మిమాధురి బిర్యానీ వండి, భర్తకు పెట్టేటపుడు 20 నిద్రమాత్రలు కలిపింది, భర్త గాఢ నిద్రలోకి వెళ్లాక ప్రియుడిని ఇంటికి పిలిచి, అతనితో కలిసి భర్తను చంపేసింది.

అనంతరం గోపి ఛాతిపై కూర్చోగా, భర్త మొహంపై దిండు పెట్టి అతన్ని చంపేసింది, గోపి వెళ్లిపోయాక రాత్రంత పోర్న్ వీడియోలు చూస్తూ గడిపిన లక్ష్మిమాధురి, ఉదయం 4 గంటలకు స్థానికులను పిలిచి, తన భర్త గుండెపోటుతో మృతిచెందినట్లు హడావిడి చేసింది.

మృతదేహం చెవిలో నుండి రక్తం రావడం, మొహంపై గాయాలు ఉండడం గమనించి, శివనగరాజు తండ్రితో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేసారు. ఛాతీ వద్ద ఎముకలు విరిగి ఊపిరాడకుండా చనిపోయాడని నిర్ధారించుకుని, లక్ష్మిమాదురిని అదుపులోకి తీసుకున్నారు. విచారణలో ప్రియుడితో కలిసి తానే భర్తను హత్య చేసినట్లు లక్ష్మిమాధురి అంగీకరించింది. ఈ ఘటన స్థానికంగా రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపుతోంది.

Comments are closed

Related Posts