తనచావుకు భార్య, అత్తామామలే కారణమంటూ ఓవ్యక్తి హుస్సేన్ సాగర్‌లో దూకి ఆత్మహత్య చేసుకున్న ఘటన లేక్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. మార్కాపురానికి చెందిన సీతారాం రెడ్డి (36), రేణుక దంపతులు బాచుపల్లిలో నివాసం ఉంటున్నారు. ఇద్దరూ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లే. గతంలో భార్య రేణుక ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన వ్యక్తితో ఇంటినుంచి వెళ్లిపోయి కొద్ది రోజుల తరువాత తిరిగి వచ్చింది. అప్పటినుంచి ఆమె ఇంట్లోనే ఉంటోంది.
అయితే గత జనవరి 24న ఆమె మళ్లీ అదృశ్యమైంది. భార్య కనిపించకుండా పోవడంతో ఆమె తల్లిదండ్రులు బాచుపల్లికి వచ్చి అక్కడే ఉంటున్నారు. ఆదివారం అత్తామామలు పిల్లలను తీసుకుని సొంతఊరు నంద్యాలకు వెళ్లిపోయారు. ఈపరిణామాలతో మనస్తాపానికి గురైన సీతారాంరెడ్డి ఆదివారం సాయంత్రం హుస్సేన్ సాగర్‌లో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు.
సోమవారం ఉదయం నుంచి హైడ్రా, లేక్ పోలీసులు గాలింపు చేపట్టగా సాయంత్రానికి మృతదేహం బయటపడింది. తనచావుకు భార్య, అత్తామామలతో పాటు రమణారెడ్డి అనేవ్యక్తి కారణమని ఫోన్‌లో స్టేటస్ పెట్టుకున్నట్లు పోలీసులు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టంనిమిత్తం గాంధీమార్చురీకి తరలించారు.











Comments are closed