ఓబుళాపురం అక్రమ మైనింగ్ వ్యవహారంపై ఐఏఎస్ అధికారిణి శ్రీలక్ష్మి పిటిషన్పై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఈ కేసులో తనను నిర్దోషిగా ప్రకటించాలంటూ ఆమె దాఖలు చేసిన రివిజనల్ పిటిషన్ పై శ్రీలక్ష్మికి భారీ ఎదురుదెబ్బ తగిలిగింది. డిశ్చార్జ్ పిటిషన్ కొట్టివేత తనను నిందితురాలిగా తొలగించాలంటూ శ్రీలక్ష్మి దాఖలు చేసిన డిశ్చార్జ్ పిటిషన్ను గతంలో తెలంగాణ హైకోర్టు కొట్టివేసింది. ఆ తీర్పును సుప్రీంకోర్టు సమర్థించింది. ‘క్యాప్టివ్ మైనింగ్’ తొలగింపు.. శ్రీలక్ష్మి ఉద్దేశపూర్వకంగా ‘క్యాప్టివ్ మైనింగ్’ అనే పదాన్ని తొలగించడం ద్వారా అక్రమాలకు దారులు తెరిచారని సీబీఐ వాదించింది.
ఈ వ్యవహారంలో ఆమెది కీలక పాత్ర అని పేర్కొంది. అక్రమాస్తుల ఆరోపణ: శ్రీలక్ష్మి పదవిలో ఉన్న సమయంలో ఆమె మరిది భారీగా అక్రమాస్తులు కూడబెట్టుకున్నారని సీబీఐ కోర్టు దృష్టికి తీసుకెళ్లింది. స్టే పొరపాటుపై వివరణ: ఈ కేసును గతంలో వేరే కేసుగా భావించి తాము పొరపాటున స్టే (Stay) ఇచ్చామని, ఇప్పుడు ఆ పొరపాటును సవరిస్తున్నామని జస్టిస్ ఎం.ఎం. సుందరేశ్ ధర్మాసనం పేర్కొంది. కోర్టు వ్యాఖ్యలు: పొరపాటుగా ఇచ్చిన స్టేను నిందితులు ఇన్నాళ్లూ ‘ఎంజాయ్’ చేశారని ధర్మాసనం వ్యాఖ్యానించింది. విచారణకు ఆదేశం: కేసు విచారణను ట్రయల్ కోర్టులో (కింది కోర్టులో) కొనసాగించాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది.







Comments are closed