At Peoplespost News, we aim to give our readers clear and useful information. We focus on honest reporting and keeping you updated about important events around the world.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారం కోల్పోయినప్పటికీ ఆయన మాటతీరిలో ఎలాంటి మార్పు రాలేదు.. అధికారం ఉన్నప్పుడు ప్రభుత్వ సభల్లో చిన్న పిల్లలను ఎదురుగా కూర్చోబెట్టి రాజకీయ ప్రసంగాలు చేసిన జగన్.. ఇప్పుడు అధికారం కోల్పోయేసరికి తన మాటలకు మరింత హద్దు లేకుండా మాట్లాడుతున్నారు.. తాజాగా మెడికల్ కళాశాలల నిర్వహణలో టిడిపి ప్రభుత్వం తీసుకొచ్చిన పిపిపి విధానాన్ని వ్యతిరేకిస్తూ కోటి సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించింది వైసిపి.. ఆ సంతకాలను గవర్నర్ కు అందజేసారు.
అనంతరం మీడియాతో మాట్లాడిన జగన్ మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు జవాబు ఇస్తూ.. చంద్రబాబు ఒక్కరోజు యోగా కోసం రూ.300 కోట్లు ఖర్చు పెట్టారని, తాను 240 కోట్లతో విశాఖలో రుషికొండ భవనాలను నిర్మించాలని చెప్పుకొచ్చారు. ఇంతవరకూ బానే ఉంది అయితే జగన్ ఈ విషయాలు మాట్లాడుతూ.. మోడీ ఏపీ వస్తే ఎక్కడ పెడతారు.. వాడెవడో రష్యా ప్రెసిడెంట్ పుతిన్ వస్తే ఎక్కడ పెడతారు అంటూ పుతిన్ ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు..
ఇలా మనదేశ ప్రధాని నరేంద్ర మోడీ ఎంతో గౌరవించే ఆయన సన్నిహితుడు పుతిన్ నుద్దేశించి జగన్ మాట్లాడడంపై విమర్శలు వినిపిస్తున్నాయి. మోడీకి సన్నిహితంగా ఉంటున్న ఒక అగ్ర దేశం అధ్యక్షుడనే వాడెవడో వీడెవడో అంటూ మాట్లాడడం జగన్ కుసంస్కారానికి నిదర్శనం అంటూ కూటమి కార్యకర్తలు విమర్శిస్తున్నారు. మాజీ సీఎంగా పనిచేసిన జగన్ కనీస బాధ్యతగా మాట్లాడాల్సిందని హితవు పలుకుతున్నారు.. మరికొందరైతే ఫోర్బ్స్ మ్యాగజైన్ లోగో వ్లాదిమిర్ పుతిన్ 4సార్లు అత్యంత శక్తివంతమైన వ్యక్తిగా ర్యాంక్ పొందారని, ప్రపంచంలోని అతి తక్కువమంది శక్తివంతమైన వ్యక్తుల్లో పుతిన్ ఒకరని అలాంటి వ్యక్తిని వాడెవడో అంటావా అని విమర్శిస్తున్నారు..
పుతిన్ ను వాడెవడో అంటావా.. కనీస బాధ్యతగా మాట్లాడవా.?

Related Tags: