భారత న్యాయవ్యవస్థలో అరుదైన ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటన మహారాష్ట్రలోని పుణె కోర్టులో జరిగింది. 1974లో నమోదైన ఒక దొంగతనం కేసులో నిందితుడిని 51సంవత్సరాల అనంతరం నిర్దోషిగా ప్రకటిస్తూ కోర్టు తీర్పు వెలువరించింది. గడియారంతోపాటు కేవలం రూ.4 నగదు, ఒక చేతి రుమాలు దొంగతనం చేశారనే ఆరోపణలతో అప్పట్లో కేసు నమోదైంది.
ఈ కేసులో మొదట ముగ్గురు నిందితులపై కేసు పెట్టగా, ఇద్దరు నిందితులు అప్పుడే కోర్టులో తప్పును ఒప్పుకుని శిక్ష అనుభవించారు. మూడో నిందితుడు పరారీలోకి వెళ్లడంతో కేసు సంవత్సరాల తరబడి కొనసాగుతూ వచ్చింది. కాలక్రమేణా సాక్షులు లభించకపోవడం, సరైన ఆధారాలు లేకపోవడంతో కేసు బలహీనమైంది.
చివరకు పూణె కోర్టు, సాక్ష్యాధారాలు లేని పరిస్థితిలో నిందితుడిని శిక్షించలేమని స్పష్టం చేస్తూ అతడిని నిర్దోషిగా విడుదల చేసింది. రూ.4 విలువైన దొంగతనం కేసు 51 ఏళ్లు నడవడం న్యాయవ్యవస్థలో ఆలస్యానికి ప్రతీకగా మారిందని న్యాయ నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. ఈ ఘటనలో చిన్న కేసులైనా కాలానుగుణంగా పరిష్కారం కాకపోతే వ్యక్తుల జీవితాలపై ఎంత ప్రభావం చూపుతాయో చెప్పే ఉదాహరణగా నిలిచింది. అదే సమయంలో, ఆలస్యమైనా న్యాయం జరిగిందన్న భావనను ఈ తీర్పు కలిగిస్తోంది.














Comments are closed