Shopping cart

Subtotal $0.00

View cartCheckout

At Peoplespost News, we aim to give our readers clear and useful information. We focus on honest reporting and keeping you updated about important events around the world.

TnewsTnews
  • Home
  • Blog
  • 2029ఎన్నికల్లో పోటీ చేస్తాం.. నంబర్ వన్ గా నిలిచిన ఆస్క్ కవిత ఇంటరాక్షన్

2029ఎన్నికల్లో పోటీ చేస్తాం.. నంబర్ వన్ గా నిలిచిన ఆస్క్ కవిత ఇంటరాక్షన్

సామాజిక తెలంగాణయే తన లక్ష్యమని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. 2029ఎన్నికల్లో తాము పోటీలో ఉంటామని తేల్చిచెప్పారు. సోమవారం ఆస్క్ కవిత హ్యాష్ ట్యాగ్ పై ట్విట్టర్ లో పలువురు నెటిజన్లు అడిగిన ప్రశ్నలకు కవిత సమాధానాలు ఇచ్చారు. తెలంగాణ విషయంలో తన విజన్, జాగృతి భవిష్యత్ కార్యాచరణ, కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలు సహా పలు ప్రశ్నలకు సమాధానాలిచ్చారు. అయితే పాలిటిక్స్ విభాగం లో ఆస్క్ కవిత ఇంటరాక్షన్ నంబర్ వన్ గా నిలిచింది. యువత, మహిళలు వారికి నచ్చిన రంగాల్లో అవకాశాలు పొందాలని.. అందుకు వారిని ప్రోత్సహించాల్సిన అవసరముందన్నారు.

యువత, మహిళలకు రాజకీయ అవకాశాలు కల్పించేందుకు జాగృతి కృషి చేస్తుందన్నారు. కొత్త పార్టీ గురించి అడిగిన ప్రశ్నకు క్లారిటీ ఇస్తూ 2029ఎన్నికల్లో పోటీ చేస్తామని స్పష్ చేశారు. ప్రజలు సూచించిన పేరునే పార్టీకి పెడుతామని, తెలంగాణ సాధికారిత సాధించాలంటే మెరుగైన, నాణ్యమైన ఉచిత విద్య, వైద్యం ప్రజలకు అందాలన్నారు. ఉద్యోగాలు, స్కిల్, భద్రత మూడింటిలో దేనికి ప్రాధాన్యం ఇస్తారని ప్రశ్నించగా… యువతకు ఉద్యోగాలు కల్పించటమే తన ప్రథమ ప్రాధాన్యమని చెప్పారు. ఉద్యోగాలతో పాటు వారికి భద్రత కూడా కల్పించాలన్నారు. సామాజిక న్యాయం కోసం జాగృతి పోరాటం కొనసాగుతుందన్నారు.

రేవంత్ రెడ్డి పరిపాలన గురించి పలువురు నెటిజన్లు కవిత ను ప్రశ్నలు అడిగారు. ఇచ్చిన హామీలను నెరవేర్చటంలో కాంగ్రెస్ అట్టర్ ప్లాప్ అయ్యిందన్నారు కవిత. కాంగ్రెస్ పాలనపై ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని, ఫీజు రీయింబర్స్ మెంట్ చెల్లించకపోవటంతో లక్షలాదిమంది విద్యార్థులు చదువులకు దూరం కావాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తంచేశారు.

ప్రభుత్వం నిర్లక్ష్యం ఆడపిల్లల చదువుకు మరణశాసనంగా మారిందన్నారు. ఇక రైతుల ఆత్మహత్యలు చాలా బాధకరమని చెప్పారు. ప్రభుత్వం చేతగాని, నిర్లక్ష్య వైఖరిని ఇది నిదర్శనమని చెప్పారు. ఇక ఫార్మా సిటీ కోసం తీసుకున్న భూముల్లో ఫ్యూచర్ సిటీ అంటూ హడావుడి చేయటంపై మండిపడ్డారు. తర్వలోనే అక్కడి రైతులకు మద్దతుగా పోరాటం చేస్తామని చెప్పారు. కాంగ్రెస్ వచ్చాక సింగరేణి సంస్థను తీవ్ర నిర్లక్ష్యం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్ లో ప్రజలకు కనీస మౌలిక సదుపాయాలు కల్పించకపోవటంపై కవిత ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అయితే గంటన్నర పాటు సాగిన ఆస్క్ కవిత ఇంటరాక్షన్ లో వందలాది మంది ట్విట్టర్ ప్రశ్నలు అడిగగా.. కవిత వారికి సమాధానాలు ఇచ్చారు. సోమవారం ట్విట్టర్ పాలిటిక్స్ విభాగంలో కవిత ఇంటరాక్షన్ నంబర్ వన్ గా నిలిచింది.

Comments are closed

Related Posts