At Peoplespost News, we aim to give our readers clear and useful information. We focus on honest reporting and keeping you updated about important events around the world.
కేసీఆర్ చుట్టూ దెయ్యాలున్నాయని గతంలో చెప్పి ఒప్పుడు ఒక్కో దెయ్యం గురించి సందర్భం వచ్చినప్పుడల్లా ఆరోపిస్తున్నారు కవిత.. ఆమె ప్రధాన టార్గెట్ హరీష్ రావు, సంతోష్ రావు. తర్వాత ఎవరు వస్తారో తెలియదు కానీ.. ఇప్పటికి వీరిద్దరిపై కేసీఆర్ అనుమానాలు పెంచేసుకుని వారిద్దరినీ గెంటేయాలన్నట్లుగా ఆరోపణలు చేస్తున్నారు. వారిద్దరికీ సీఎం రేవంత్ తో లింకులు పెడుతున్నారు. కానీ కేసీఆర్ అంత అమాయకంగా ఉంటారా అని ఆమె ఆరోపణలు చూస్తున్న బీఆర్ఎస్ క్యాడర్ కు సందేహం వస్తోంది.
సంతోష్ రావు ప్రత్యక్ష రాజకీయాల్లో లేరు.. కేసీఆర్‌కు వ్యక్తిగతంగా నీడలా ఉండే వ్యక్తి మాత్రమే. కానీ కవిత దృష్టిలో సంతోష్ సహాయకుడు కాదు, కేసీఆర్ చుట్టూ ఒక ఒక కోటను నిర్మించిన వ్యక్తి. కేసీఆర్‌కు ఎవరిని కలవనివ్వాలి, ఏ సమాచారం చేరవేయాలి అనే అంశాలను సంతోష్ రావు నియంత్రించారని కవిత నమ్ముతున్నారు. గద్దర్ వంటి ప్రజా గాయకులను ప్రగతి భవన్ గేటు వద్దే ఆపేయడం, ఈటల రాజేందర్ వంటి ఉద్యమ నేతలు పార్టీ వీడటం వంటి పరిణామాల వెనుక సంతోష్ రావు కుట్ర ఉంది అనేది కవిత ఆరోపణ. కేసీఆర్‌ను అందరికీ దూరంచేసి, పార్టీని బలహీనపరిచిన మొదటి దెయ్యం సంతోష్ రావేనని కవిత బాహాటంగానే విమర్శిస్తున్నారు. కానీ కేసీఆర్ కు తెలియకుండా ఇవన్నీ జరుగుతాయా ఆయనేమీ కేసీఆర్ ఆషామాషీ రాజకీయనాయకుడు కాదుగా. తనను తాను కోటరీలో బంధించుకునే వ్యక్తా.. అనేది అసలు ప్రశ్న..
కవిత ఆవేదన అంతా తండ్రికి తనను దూరం చేశారనే పాయింట్ మాత్రమే.. ఢిల్లీ లిక్కర్ స్కామ్ సమయంలో పార్టీ తనను ఒంటరిని చేసిందని, దానికి హరీష్ రావు, సంతోష్ రావులే కారణమని కవిత భావిస్తున్నారు. తనను పార్టీ నుంచి సస్పెండ్ చేసే వరకు పరిస్థితి వచ్చిందంటే అది కచ్చితంగా సంతోష్, హరీష్ కుట్రేనని అందుకే వారిపై కేసీఆర్ లో అనుమానాలు పెరిగేలా చూస్తున్నారు. సంతోష్ రావు ముఖ్యమంత్రి రేవంత్ కి ఇన్ఫార్మర్‌గా మారారని ఆయన విశ్వసనీయతను దెబ్బతీసేలా మాట్లాడుతున్నారు.
అయితే కవిత పార్టీలో లేకపోవడం, సస్పెన్షన్‌కు గురికావడం వల్ల ఆమె మాటలకు విలువ లేదనే వాదన ఉన్నప్పటికీ.. ఆమె కేసీఆర్ కుమార్తె కాబట్టి ఆ ప్రభావం కచ్చితంగా ఉండే అవకాశముంది. హరీష్ రావు లాంటి ట్రబుల్ షూటర్ మీద, సంతోష్ రావు లాంటి కేసీఆఱ్ రైట్ హ్యాండ్ మీద ఆమె చేస్తున్న దాడి పార్టీ క్యాడర్‌ను అయోమయానికి గురిచేస్తోంది. కేసీఆర్ కాకపోయినా బీఆర్ఎస్ నేతలు దీనిని ఒక అవకాశంగా తీసుకుంటారు. తద్వారా బీఆర్ఎస్ బలహీనపడుతుంద కవితకు కూడా కావాల్సింది ఇదేనని అర్ధమవుతోంది.
Kavitha fires: సంతోష్ రావు వ్యక్తిగత నీడ కాదు.. నెగిటివ్ ఫిల్టర్..

Related Tags: