Shopping cart

Subtotal $0.00

View cartCheckout

At Peoplespost News, we aim to give our readers clear and useful information. We focus on honest reporting and keeping you updated about important events around the world.

TnewsTnews
  • Home
  • Politics
  • Kavitha Cry:కవిత కన్నీటికి విలువ ఎంత.?

Kavitha Cry:కవిత కన్నీటికి విలువ ఎంత.?

kavitha crying

తెలంగాణ రాజకీయాల్లో కవిత కన్నీరు ఓ సంచలనం అనుకోవచ్చు. రాజీనామా చేసిన ఆమె మండలికి రావాలని అనుకోలేదు. కానీ ప్రత్యేకంగా వచ్చి సమయం తీసుకుని తన బాధ అంతా వెళ్లగక్కారు. ఈక్రమంలో ఉబికి వస్తున్న కన్నీరును ఆపుకోలేదు. అదే సమయంలో కన్నీటి సాక్షిగా తాను రాజకీయ శక్తిగా తిరిగి వస్తానని చాలెంజ్ చేశారు. కుటుంబంతో అన్ని బంధాలు తెంచుకుంటున్నట్లు కవిత ప్రకటించారు. ఇప్పుడు కవిత త్యాగానికి, కన్నీటికి ఎంతవిలువ ఉంటుంది.. రాజకీయంగా ఈకన్నీరు ఎంతమేర ఆమెకు ప్రజలనుండి మద్దతు లభించేలా చేస్తాయన్నదే ఇప్పుడు కీలక అంశం. కవిత ఇప్పుడు సంపూర్ణంగా స్వతంత్రనేత. తాను కుటుంబంతో తెగ దెంపులు చేసుకుంటున్నట్లుగా ప్రకటించారు .

చాలామందికి ఇప్పుడు కాకపోతే కొద్దిరోజులకైనా కల్వకుంట్ల కుటుంబం అంతా కలసిపోతుందని అనుకుస్తున్నారు. ఆఅవకాశమే లేదని కవిత తేల్చారు. సొంత రాజకీయాన్ని ప్రారంభిస్తున్నారు. ఇప్పటివరకూ ఆమె కేసీఆర్ ను గౌరవించేవారు. ఇప్పుడు రాజకీయంగా ఎదుర్కోవడానికి కవిత రెడీ అవుతున్నారు. ఇప్పటికే కేసీఆర్ ఫోటో లేకుండా జాగృతిని నడుపుతున్న కవిత ఇకముందు కేసీఆర్ పేరు కూడా ఉపయోగించుకునే అవకాశం లేదు. రాజకీయంగా ఉన్నతస్థాయికి ఎదగాలన్న ఆశనో లేకపోతే కుటుంబంలో తనపై చూపిన వివక్షో కానీ కవిత బయటకు వచ్చేశారు. ఇకపై కవిత బీఆర్ఎస్ లో ఆమె కలిసే అవకాశం లేదు.

సొంతంగా రాజకీయాలు చేయాలని డిసైడయ్యారు. ఇప్పుడు ఆమె బలంగా నిలబడాలంటే ఉండాల్సింది ప్రజల మద్దతు మాత్రమే. ఇప్పుడు కవిత తనపై సానుభూతి చూపించాలనేలా పక్కాప్లాన్ తో రంగంలోకి దిగారు. రాజకీయాల్లో ఎప్పుడూ సానుభూతికి మించిన అస్త్రం ఉండదు. మరి ఆఅస్త్రాన్నే కవిత వ్యూహాత్మకంగా ప్రయోగించారు. తనను కుటుంబంలో ఒంటరిని చేశారని.. బయటకు గెంటేశారని కన్నీరు పెట్టుకున్నారు. ఇకముందు కూడా కవిత కన్నీరు పెట్టుకునే అవకాశాలున్నాయి. కానీ ఆకన్నీటిపై ప్రజలు ఎలా స్పందిస్తారన్నదే కీలకం. వచ్చే ఎన్నికల్లో కవిత గెలవకపోచ్చు కానీ.. బీఆర్ఎస్ ను మాత్రం ఓడించగలరు.

ప్రస్తుత రాజకీయాల్లో రెండు, మూడుశాతం ఓట్లు చీల్చినా బీఆర్ఎస్ నష్టమే.. పంచాయతీ ఎన్నికలనే తీసుకుంటే ఉత్తర తెలంగాణలో బీఆర్ఎస్ చాలా నష్టపోయినట్లుగా.. రాబోయే రోజుల్లో మరింత గడ్డుపరిస్థితి ఎదుర్కోవడం ఖాయమే. అందుకే కవిత చాలా సీరియస్ రాజకీయాలు చేయాలనుకుంటున్నారు. ఆమె రాజకీయాలు ఎంత క్లిక్ అయితే.. బీఆర్ఎస్ విజయానికి అంత దూరమవుతూ ఉంటుంది. కవిత తనను అవమానించిన బీఆర్ఎస్ పార్టీపై పగ తీర్చుకోవడం వరకూ సక్సెస్ అవుతారు.. తాను గెలవడం లేదా కింగ్ మేకర్ అవడం మాత్రం జరిగే రాజకీయ పరిణామాల బట్టి ఉండవచ్చు.

Comments are closed

Related Posts