Shopping cart

Subtotal $0.00

View cartCheckout

At Peoplespost News, we aim to give our readers clear and useful information. We focus on honest reporting and keeping you updated about important events around the world.

TnewsTnews
  • Home
  • Telangana
  • రాజకీయ పార్టీగా జాగృతి.. ఏప్రిల్‌లో కొత్తపార్టీ..!

రాజకీయ పార్టీగా జాగృతి.. ఏప్రిల్‌లో కొత్తపార్టీ..!

తెలంగాణ రాజకీయాల్లో మరో కొత్తఅధ్యాయానికి తెర లేవనుంది. జాగ‌ృతి అధ్యక్షురాలు కవిత నేతృత్వంలోని తెలంగాణజాగృతి త్వరలో రాజకీయ పార్టీగా రూపాంతరం చెందనుంది. కొత్తపార్టీ ఏర్పాటుకోసం గత నెలలోనే కేంద్ర ఎన్నికల సంఘానికి దరఖాస్తు చేసినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. అన్ని ప్రక్రియలు సజావుగా పూర్తయితే వచ్చే ఏప్రిల్ చివరివారంలో లేదా మే మొదటి వారంలో పార్టీని లాంఛనంగా ప్రారంభించేందుకు సన్నాహాలుచేస్తున్నారు.

బీఆర్ఎస్ నుంచి సస్పెన్షన్‌కు గురైన తర్వాత ఎమ్మెల్సీ పదవికి రాజీనామాచేసిన కవిత, సొంత రాజకీయవేదిక ఏర్పాటు పై దృష్టి సారించారు. ఇందులో భాగంగా ‘జాగృతి జనంబాట’ పేరుతో ప్రజల్లోకివెళ్తూ క్షేత్ర స్థాయిలో సమస్యలను తెలుసుకుంటున్నారు. పార్టీ విధానాల రూపకల్పనకోసం వివిధవర్గాల అభిప్రాయాలు సేకరించేందుకు 50కమిటీలను ఏర్పాటుచేశారు. “సామాజికతెలంగాణ” సాధనే లక్ష్యంగా తనపార్టీ పని చేస్తుందని, రాబోయే అసెంబ్లీఎన్నికల్లో పోటీచేస్తుందని కవితఇప్పటికే స్పష్టంచేశారు.

ఈసీఐ నుంచి సకాలంలో గుర్తింపు లభిస్తే జీహెచ్‌ఎంసీ ఎన్నికల బరిలోనూ నిలిచే అవకాశం ఉందని తెలుస్తోంది. వ్యూహాల రూపకల్పనలో ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ పాత్ర కూడా ఉండచ్చనే ప్రచారం జరుగుతోంది. తనకు సెంటిమెంట్ ఎక్కువని, పార్టీ ప్రకటనకు మంచి ముహూర్తంకోసం ఎదురుచూస్తున్నానని కవిత ఇటీవల వ్యాఖ్యానించడం ఈపరిణామాలకు బలంచేకూరుస్తోంది. త్వరలోనే రాష్ట్ర వ్యాప్తంగా సభ్యత్వనమోదు కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు ఏర్పాట్లుచేస్తున్నారు.

Comments are closed

Related Posts