Shopping cart

Subtotal $0.00

View cartCheckout

At Peoplespost News, we aim to give our readers clear and useful information. We focus on honest reporting and keeping you updated about important events around the world.

TnewsTnews
  • Home
  • Politics
  • కేసుల భయంతోనే బహిరంగ సభల డ్రామాలు

కేసుల భయంతోనే బహిరంగ సభల డ్రామాలు

kcr arest

బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ రాజకీయంగా యాక్టివ్ అయ్యేందుకు ప్రయత్నిస్తున్నారు. 15రోజుల్లో మూడు బహిరంగసభలు పెడతామంటున్నారు. ఇలా చెప్పి వారం అవుతోంది కానీ ఇప్పటివరకూ ఒక్క బహిరంగసభ తేదీ కూడా ఖరారు చేయలేదు. ఎక్కడ పెట్టాలో కూడా నిర్ణయించలేదు. కానీ కేసీఆర్ సమావేశాల పేరుతో హడావుడి చేసేందుకు ప్రయత్నించారు. కృష్ణా నీటి విషయంలో కొత్తగా ఎలాంటి డెలవప్‌మెంట్స్ లేకపోయినా ఎప్పుడో జరిగిపోయిన వాటితో హడావుడి చేస్తున్నారు. అసలు లేని ఇష్యూను తెరపైకి తెచ్చి రాజకీయం చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇదంతా ఎందుకు అన్న సందేహం చాలా మందికి వస్తున్నా.. సమాధానాలు మాత్రం ఇప్పుడే మెల్లమెల్లగా తెలుస్తున్నాయి. ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ దాదాపుగా పూర్తయిందనుకున్న దశలో తెలంగాణ ప్రభుత్వం అనూహ్యగా సీనియర్ ఐపీఎస్ సజ్జనార్ నేతృత్వంలో సిట్ ను ఏర్పాటుచేసింది. ఏమీ దొరకక సిట్ ను ఏర్పాటు చేసిందని అనుకున్నారు. కానీ పెద్ద స్థాయి వ్యక్తులను విచారణకు పిలవాలన్నా..అరెస్టులు చేయాలన్నా ఆస్థాయి అధికారులు ఉండాలన్న ఉద్దేశంతో సజ్జనార్‌కు అవకాశం ఇచ్చినట్లు తెలుస్తోంది. ఆయన కూడా సీరియస్ గానే ఉన్నానని సంకేతాలు పంపుతున్నారు. ఈ విషయం తెలిసే కేసీఆర్ ప్రజల్లోకి వచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని అంటున్నారు.

పదిహేను రోజుల్లో బహిరంగసభలు అని కేసీఆర్ ప్రకటించినా ఇప్పటికీ ఆ తేదీలు ఎవరికీ తెలియదు.. ట్యాపింగ్ కేసులో సిట్ నుంచి వచ్చే నోటీసుల్ని పరిణామాలు మారే అవకాశముందని తెలుస్తోంది. మహబూబ్ నగర్, నల్లగొండ, రంగారెడ్డిజిల్లాలకు చెందిన నేతల్ని ఫామ్ హౌస్ కు పిలిపించి మాట్లాడిన కేసీఆర్. సభల తేదీలను ఖరారు చేయలేదు. 29నుంచి అసెంబ్లీ సమావేశాలు ఉన్నాయని అవి అయిపోయాక బహిరంగసభల తేదీలను ఖరారు చేద్దామని చెప్పారు. ఆ లోపే పోలీసుల నోటీసులు వస్తే దానికి తగ్గట్లు బహిరంగసభలు నిర్వహించనున్నారు. తాము జనాల్లోకి వస్తూంటే భయపడి అడ్డుకోవడానికి కేసులు, నోటీసులు అని ఆరోపించడానికి బాగుంటుందని బీఆర్ఎస్ భావిస్తోంది.

Comments are closed

Related Posts