Shopping cart

Subtotal $0.00

View cartCheckout

At Peoplespost News, we aim to give our readers clear and useful information. We focus on honest reporting and keeping you updated about important events around the world.

TnewsTnews
  • Home
  • desk
  • Rajagopal Step : రాజగోపాల్ రెడ్డి ప్లాన్ ఏంటి.?

Rajagopal Step : రాజగోపాల్ రెడ్డి ప్లాన్ ఏంటి.?

మంత్రిపదవి కోసం తహతహలాడుతున్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి విచిత్ర ప్రకటనలు చేస్తున్నారు. తాజాగా తెలంగాణను శాసించేరోజు మునుగోడు నుంచే వస్తుందని, స్థానిక ప్రజల ఆశీర్వాదంతో తాను రాష్ట్ర రాజకీయాల్లో కీలకపాత్ర పోషిస్తానని ఆయన ప్రకటించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుండి రాజగోపాల్ రెడ్డి మంత్రిపదవి ఆశిస్తున్న విషయం అందరికీ తెలిసిందే.. గత మంత్రివర్గ విస్తరణలో ఆయనకు చోటు దక్కకపోవడంతో తీవ్ర అసంతృప్తికి గురయ్యారు. ఒకే కుటుంబంలో ఇద్దరికి మంత్రిపదవులు ఇవ్వడం కుదరదని అధిష్టానం చెబుతున్నా ఆయన మాత్రం పట్టు వీడడంలేదు. ఇప్పుడు “శాసిస్తా” అంటూ చేస్తున్న వ్యాఖ్యలు, మంత్రిపదవి ఇవ్వకపోతే తనదారి తాను చూసుకుంటాననే పరోక్ష హెచ్చరికలను విశ్లేషిస్తున్నారు.

రాజగోపాల్ రెడ్డి ఆర్థికంగా బలమైన నేత కావడంతో, ఆయన చుట్టూ కొంత మంది ఎమ్మెల్యేలతో కూడిన ఒక ప్రత్యేకవర్గం ఏర్పడిందనే గుసగుసలు వినిపిస్తున్నాయి. మునుగోడు క్యాంపు కార్యాలయం వేదికగా ప్రభుత్వ నిర్ణయాలపై ధిక్కార స్వరం వినిపిస్తూ ప్రత్యామ్నాయ రాజకీయ వేదికను సిద్ధం చేస్తున్నారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రీజనల్ రింగ్ రోడ్ భూ నిర్వాసితుల పక్షాన పోరాడుతామని చెప్పడం ద్వారా ప్రభుత్వంపై ఒత్తిడి పెంచే ప్లాన్ చేస్తున్నట్లు కనిపిస్తోంది.

Comments are closed

Related Posts